త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యమేలడం తధ్యం

-    బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీలు తెలంగాణలో త్వరలోనే రాజ్యమేలడం తధ్యమని బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు  గడుస్తున్న భారతదేశాన్ని నడిపే మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ, మీడియా,అధికార వ్యవస్థ,చట్టసభలో బీసీలకు ప్రాతినిధ్యం నేటికీ అరకొరగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా అగ్రవర్గాల చేతిలో ఉన్న ప్రస్తుత వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టినప్పుడే అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుతుందన్నారు. ప్రస్తుత  వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే బీసీలు,అణగారిన వర్గాలు తమ చేతిలో ఉన్న ఓటు ద్వారానే అధికారాన్ని చేబట్టి మిగతా వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతారన్నారు. తదనుగుణంగా చట్టసభల్లో అధికారం చేపట్టడానికి అవసరమైన క్షేత్రస్థాయి నాయకత్వ నిర్మాణం కోసం బీసీ రాజ్యాధికార సమితి సమర్థులైన బీసీ నాయకులతో పూర్తిస్థాయి కమిటీలను నిర్మించుకొని పేద ప్రజల పక్షాన, బీసీల పక్షాన ఉద్యమించనుందని తెలిపారు. తద్వారా ప్రజల్లో ఓటు చైతన్యాన్ని పెంపొందించి రాజ్యాధికారాన్ని చేపట్టడం కోసం దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళనున్నామన్నారు. తదనంతరం 21 మంది నాయకులతో పూర్తి స్థాయి కరీంనగర్ జిల్లా కమిటీని దాసు సురేశ్ ప్రకటించించారు .కమిటీ అధ్యక్షులుగా కడారి ఐలయ్య , కార్య నిర్వాహణ అధ్యక్షులుగా రాచ కొండ విట్టలేశ్వర్ మరియు,గడ్డం శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిలుగా బండి మల్లయ్య యాదవ్, బుర్ర కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వంగ వెంకటేశ్వర్లు, మందా మల్లారెడ్డి ,కొండ రవీందర్, జంగా కొమురయ్య, కోశాధికారిగా బెజ్జంకి రామబ్రహ్మం, సెక్రటరీలుగా దూడం చంద్రశేఖర్, వీరబోయిన మల్లయ్య యాదవ్,ఈరెళ్ళ విజయ్ కుమార్ ,ఎండి చాంద్ పాషా,చిలుక నరసప్ప , దత్తాత్రేయ రాజేందర్ మరియు కమిటీ సభ్యులు బత్తుల  చంద్రమౌళి,గడప సత్యనారాయణ,మామిడి దామోదర్,అరుకల భాస్కర్ ,ముసిపట్ల నరసింహస్వామి తదితరులను ఎన్నుకున్నారు.నూతన కమిటీ ప్రకటన అనంతరం గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం మాట్లాడుతూ దశాబ్దాలుగా అధికారాన్ని చేపట్టిన అగ్రవర్గాలు బీసీల బాగోగులు పట్టించుకోకుండా అట్టడుగు వర్గాలకు పాలించడానికే తము  పుట్టినట్లుగా వ్యవహరించడం బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు,అసహనానికి లోనుచేస్తూ నేడు రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించే స్థాయికి తీసుకొచ్చారన్నారు. బీసీలు తమ ఓట్లతో అధికారంలో కూర్చునే విధంగా వ్యవస్థను మార్చడమే తమ తదుపరి కర్తవ్యం అన్నారు.ప్రధాన కార్యదర్శి సుతారి లచ్చన్న మాట్లాడుతూ అగ్రవర్గాల పీడన నుండి బీసీలు బయటపడే సమయం ఆసన్నమైందని ఓటు ద్వారా అధికారం చేపట్టడమే ఇకా మిగిలింది అన్నారు. అందుకోసం కమిటీలు పూర్తిస్థాయిలో నూతనంగా ఎన్నుకోబడిన కమిటీలు పనిచేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.