ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ నుంచి కాంగ్రెస్‌కు రూ.25 ముట్టాయంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈటల చేసిన ఈ కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణానికి రావాలంటూ రేవంత్ సవాల్ విసరగా… ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారంటూ టీ.పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. అద్దంకి దయాకర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోందన్నారు. విపక్షాలు ఏకమయ్యి పోరాడాల్సిన పరిస్థితి నుంచి విఛ్ఛినం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈటల అవగాహన లేమితోఫ్రస్టేషన్‌తో చేసిన వాఖ్యలు అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. చేరికలు లేకనే ఈటల ఫ్రస్టేషన్ అవుతున్నారని అన్నారు. ఢాంబికాలు చెప్పుకుని ఈటల బీజేపీలో చేరారని.. రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్ రెడ్డిని కొన్నారని విమర్శించారు. ఈటల ఆరోపణలు నిజమైతే.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలన్నారు. దమ్ముంటే ఈటల భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని మరోసారి కాంగ్రెస్ నేత సవాల్ చేశారు.మోడీఅమిత్ షా‌ దగ్గర మార్కులు కొట్టేందుకే ఈటల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చర్చ కోసం ఈటల తాపత్రయ పడుతున్నారన్నారు. బీజేపీని లేపడానికి కేసీఆర్ పనిగట్టుకుని పనిచేస్తున్నారని విమర్శించారు. ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ బీజేపీకి హైప్ ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్‌పై పోరాడాలన్నారు. సహారా కుంభకోణంలో కేసీఆర్‌పై ఎందుకు కేసు కొట్టేసారని ప్రశ్నించారు. మిషన్ కాకతీయమిషన్ భగీరథలో జరిగిన అవినీతిపై బీజేపీ స్టాండ్ ఏంటని నిలదీశారు. 18 వేల కోట్లు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి తానే స్వయంగా చెప్పారన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ ఎందుకు తీసుకుందని అడిగారు. కర్ణాటకలో జేడీఎస్ఎంఐఎం కలయిక వెనక బీజేపీబీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. ఈటల ఛీపెస్ట్ పొలిటీషియన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్ రెడ్డితో ఈటల సంప్రదింపులు జరిపారని చెప్పుకొచ్చారు. వ్యాపారాలు కాపాడుకోవడానికి ఈటల బీజేపీలోకి పోయారని విమర్శించారు. బీజేపీలోకి పోయేలా చేసిన వ్యక్తి ఈటలను ఇప్పుడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి అప్రతిష్ట పాలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.