అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర సరస్వతి అసంతృప్తి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో స్వామిని  దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా అధికారులు వ్యవహరించారని, గుంపులుగా పోలీసులను పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని, ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానన్నారు.కొండ కింద నుంచిపై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరని స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదన్నారు. భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని, ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.కాగా సింహాచలం అప్పన్న చందనోత్సవానికి వచ్చిన భక్తులకు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. కొండ దిగువన అరకిలోమీటర్ వరకు ఆర్టీసీ బస్సులో భక్తులు వేచి ఉన్నారు. గంటల తరబడి నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండమీదకు ఎప్పుడు అనుమతి ఇస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోను..దేవస్థానం అధికారులు వైఫల్యం చెందారు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదని… భక్తులు మండిపడుతున్నారు. కొండమీదకు పంపించాలని భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘాటు రోడ్ వద్ద ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాతే… ఆర్టీసీ బస్సులను కొండపైకి పంపిస్తామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.