వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎన్నో మలుపులుమరెన్నో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఒక్కొక్కటిగా పరిస్థితులు మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఏప్రిల్-30 డెడ్‌లైన్‌తో సీబీఐ దూకుడు పెంచి ఈ కేసును కొలిక్కి తేవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఆదివారం నాడు సీబీఐ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటి వరకూ హత్యకేసును రెండు సీబీఐ బృందాలు దర్యాప్తు చేశాయి. ఈ రెండు బృందాల్లో ఒకటి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లగా.. మరొకటి పులివెందులకు వెళ్లింది. విచారణ కీలక దశలో ఉండగా.. అటొక బృందం.. ఇటొక బృందం బయల్దేరడంతో కేసు దాదాపు పూర్తయినట్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పులివెందులలో ఏం జరుగుతోంది..!?

హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం.. వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించింది. హత్య జరిగిన బాత్రూమ్‌, బెడ్‌ రూమ్ ప్రాంతాలను సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ్నుంచి నేరుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికెళ్లిన అధికారులు అక్కడ కూడా నిశితంగా పరిశీలించారు. ఎంపీ ఇంటి లోపల, ఇంటి పరిసరాలను కూడా పరిశీలించారు. అవినాష్ పీఏ రమణారెడ్డితో అధికారులు మాట్లాడటమే కాకుండా.. పీఏ ఇంటిని కూడా సీబీఐ బృందం పరిశీలించింది. ఇక్కడ పరిశీలన పూర్తయ్యాక మళ్లీ వివేకా ఇంటికి తిరిగొచ్చి పిన్‌ టూ పిన్ పరిశీలించారు. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్య ఎలా జరిగింది..? ఘటన జరిగినప్పుడు ఎవరెవరున్నారు..? హత్య జరిగిన రోజు అవినాష్ ఎక్కడున్నారు..? అని సీబీఐ అధికారులు ఆరాతీసినట్లు సమాచారం. మరోవైపు.. అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత టైమ్‌లో రావొచ్చు..? అనేదానిపై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలను సేకరించిన పోలీసులు మరోసారి క్షుణ్ణంగా క్రాస్ చెక్ చేసుకోవడానికి పులివెందులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే విచారణలో అవినాష్ చెప్పిన మాటల్లో ఎంత నిజముందో అనే విషయాన్ని తెలుసుకోవడానికే అధికారులు ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.

ఢిల్లీలో ఈ బృందం చేస్తుంది..!?

హైదరాబాద్ నుంచి ఢిల్లీకెళ్లిన మరో సీబీఐ బృందం కీలక ఆధారాలతోనే వెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు సుప్రీంకోర్టులో జరిగే విచారణకు ఈ బృందం హాజరుకానుంది. ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొత్త కోణాలన్నింటినీ న్యాయస్థానం ముందు సీబీఐ ఉంచనుంది. ఇప్పటికే మూడ్రోజుల పాటు ఎంపీ అవినాష్‌ను సీబీఐ ప్రశ్నించింది. మరోవైపు.. ఐదురోజులుగా భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లను కస్టడీలోకి తీసుకుని సీబీఐ విచారిస్తున్నది. ఈ విచారణ తర్వాత చాలా విషయాలు కొలిక్కి వచ్చాయని.. అందుకే ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లనుంది. మరోవైపు.. వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం నాడే విచారణ జరగనున్నది. గతవారం సునీత పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారించింది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.మొత్తానికి చూస్తే.. సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ బృందాలు అటు పులివెందులకు.. ఇటు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలను కాస్త క్షుణ్ణంగా గమనిస్తే సీబీఐ కీలక పురోగతి సాధించినట్లేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సోమవారం విచారణ తర్వాత కీలక పరిణామాలు

Leave A Reply

Your email address will not be published.