వామపక్షాలకు కెసిఆర్ గట్టి షాక్ ఇవ్వనున్నారా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాబోయే ఎన్నికలకు సంబంధించి వామపక్షాలకు గట్టి షాక్ తగిలేట్లుంది. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపుకు వామపక్షాలు సహకారం అందించాలని కేసీయార్ స్పష్టంచేయబోతున్నారట. బీఆర్ఎస్ వామపక్షాల పొత్తు ఖాయమని ఇప్పటికే బాగా ప్రచారం జరుగుతోంది. సీపీఐ సీపీఎం నేతలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. కాకపోతే పొత్తుల్లో భాగంగా బీఆర్ఎస్ తమకు ఇచ్చే సీట్లు ఏమిటి ? ఎన్ని అనే విషయాలపైనే స్పష్టత లేదని ఇంతకాలం చెబుతున్నారు.అయితే బీఆర్ఎస్ వర్గాల తాజా సమాచారం ఏమిటంటే వామపక్షాలకు ఒక్కసీటు కూడా ఇవ్వటానికి కేసీయార్ ఇష్టపడటంలేదట. ఎందుకంటే ఎక్కడ సీటిచ్చినా వామపక్షాలు గెలిచే అవకాశాలు తక్కువని సర్వేల్లో తేలిందట.ఇదే విషయాన్ని పై రెండు పార్టీలకు కేసీయార్ తన సర్వే నివేదికలను పంపారని పార్టీ నేతలు చెబుతున్నారు. సీట్లివ్వకపోయినా వామపక్షాలు ఎందుకని బీఆర్ఎస్ కు మద్దతిచ్చి గెలుపుకు ప్రయత్నిస్తాయి ? ఎందుకంటే సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు ఎంఎల్సీ పదవులు ఇస్తానని కేసీయార్ హామీ ఇచ్చారట.ఎంఎల్సీలు బాధ్యతలు తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపుకు సహకరించమని కేసీయార్ పై ఇద్దరు కార్యదర్శులను రిక్వెస్టుచేశారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం ఖమ్మం పాలేరుతో పాటు భద్రాచలంలోను సీపీఐ వైరా కొత్తగూడెం ఖమ్మం నియోజకవర్గాలను కోరుతున్నాయి. అయితే ఈ స్ధానాలను ఇవ్వటానికి కేసీయార్ ఏమాత్రం ఇష్టపడటంలేదట.సీట్లిచ్చినా గెలుపు కష్టం కాబట్టి హ్యాపీగా ఎంఎల్సీలు తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపుకు రాష్ట్రమంతా ప్రచారం చేయాలని అడిగారని పార్టీవర్గాలు చెప్పాయి. దీనికి వామపక్షాల కార్యదర్శులు అంగీకరించే అవకాశాలే ఎక్కువున్నాయి.ఎందుకంటే కేసీయార్ ఆఫర్ ను కాదంటే ఎంఎల్సీలు కూడా దక్కే అవకాశంలేదు. కేసీయార్ ఆఫర్ ను కాదని విడిపోయి పోటీచేస్తే ఒక్క నియోజకవర్గంలో కూడా వామపక్షాలు గెలిచే అవకాశాలు లేవు. అందుకనే కాస్త బెట్టుచేసినా తర్వాత కార్యదర్శులిద్దరు దిగిరాక వేరే దారిలేదట. అందుకనే రాబోయే ఎన్నికల్లో వామపక్షాలకు కేసీయార్ షాక్ తప్పదనే ప్రచారం పెరిగిపోతోందట.

Leave A Reply

Your email address will not be published.