రాయలసీమ ను తెలంగాణ లో కలపాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ను తెలంగాణ లో కలపాలని.. అపుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదని, తన వంతుగా ప్రజలను కూడగడతానని అన్నారు. రాష్ట్రాలు విడగొట్టడం, కొత్తగా ఏర్పాటు చేయడం కష్టం, కానీ కలపడం సులభమని అన్నారు.తమ వాళ్ళు ప్రత్యేక రాయలసీమ అంటున్నారని.. వస్తే మంచిదేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు ఆపాల్సిన అవసరం లేదని.. ఆపలేమని అన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం కూడా నిధులు విడుదల చేసిందన్నారు. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవలసిన అవసరం కేసీఆర్‌ కు ఉందన్నారు. రాయల తెలంగాణ కావడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. నాయకులు.. అందరితో మాట్లాడుతున్నానని.. సమీకరిస్తున్నానని.. ఎన్నికల తరువాత వేదికపై ఉన్న నేతలందరిని కలుస్తానని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.