రాగల రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో రాగల మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, పలు జిల్లా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, పలు జిల్లా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.పలుచోట్ల వడగళ్లవాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో, గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి వడగళ్ల వానలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

హీట్‌వేవ్స్‌ నుంచి ఉపశమనం

మరో వైపు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాగల ఆ రోజులు చాలా ప్రాంతాల్లో హీట్‌వేవ్‌ పరిస్థితుల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పింది. వారం రోజుల పాటు హేట్‌వేవ్‌ పరిస్థితులు ఉండబోవని, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు ఉండవని స్పష్టం చేసింది. వెస్ట్రన్‌ డిస్టబెన్స్‌ ఈశాన్య రాజస్థాన్‌, సెంట్రల్‌ మధ్యప్రదేశ్‌, తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సాధారణంగా హీట్‌వేవ్‌ పరిస్థితులు మార్చి జూన్‌ వరకు సంభవిస్తాయి. అరుదైన సందర్భాల్లో జులై వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 26, 27న కేరళలో , 27న తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయలో 28న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.