ఏపీ నుండి రేణుకా చౌధరి పోటీ ?

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌధరి రాబోయే ఎన్నికల్లో ఏపీ నుండి పోటీచేయాలని అనుకుంటున్నారా ? ఇదే విషయమై ఆరాతీస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. సంవత్సరాలుగా ఆమెకు మద్దతుదారులుగా ఉన్న కొందరు నేతలు మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో రేణుక విజయవాడ లోక్ సభ నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. రెండుసార్లు ఖమ్మం పార్లమెంటుకు గెలిచిన రేణుకకు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమేనట.పొగులేటి శ్రీనివాసుల రెడ్డి తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అదే జరిగితే పొంగులేటి ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇదివరకే ఎంపీ గా చేశారుకాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ఎంపీగానే పోటీచేస్తారు.పొంగులేటికి స్వయంగా రాహూల్ గాంధీయే టికెట్ హామీ ఇచ్చిన తర్వాత టికెట్ కోసం ఇక రేణుక ఎంత ఒత్తిడి పెట్టినా లాభముండదు. పైగా రేణుక అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అయిపోయారని ఖమ్మంలోనే టాక్ వినిపిస్తోంది. ఎక్కువ రోజులు ఢిల్లీ హైదరాబాద్ లో ఉండే రేణుక అవసరమైనపుడు మాత్రమే ఖమ్మంలో కనబడుతుంటారు.అదే పొంగులేటి అయితే స్ధానికుడు కాబట్టి నేతలు క్యాడర్ కు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో పొంగులేటి ఖమ్మంలో పోటీచేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపధ్యంలోనే రేణుక కన్ను విజయవాడ లోక్ సభ మీదపడిందట. ఏపీలో అయితే ఏ సీటులో పోటీచేయాలన్నా పెద్దగా పోటీ ఉండదు. ఎందుకంటే రాష్ట్ర విభజనతో పార్టీని స్వయంగా అధిష్టానమే భూస్ధాపితం చేసేసింది.కాబట్టి ఏపీలో పార్టీకి నేతల కరువుంది. ఈ విషయాన్ని గమనించే రేణుక కూడా ఆమధ్య ఏపీలో పోటీచేస్తానని గుడివాడలో పోటీచేస్తానని చెప్పింది. విజయవాడ లోక్ సభకు పోటీచేసే ఉద్దేశ్యంతోనే రెగ్యులర్ గా అమరావతి ఆందోళనల్లో కూడా పాల్గొంటున్నారు.అమరావతి ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతిసారి విజయవాడలో మీటింగులు పెట్టుకుంటున్నారు. ఇదంతా రేణుక ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని ఆమె మద్దతుదారులంటున్నారు. మరి గెలుపు అవకాశాలు ఎంతుందో ఆమెకే తెలియాలి. హైదరాబాద్ నుండి ఖమ్మంకు వలసవచ్చిన రేణుక అవసరమైతే ఖమ్మం నుండి విజయవాడకు వలస వెళ్ళటానికి రెడీగా ఉన్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Leave A Reply

Your email address will not be published.