కొనాడు ఎస్టేట్ మిస్టరీ తేల్చే పనిలో సీబీసీఐడీ..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమ్మ జయలలిత అనూహ్య మరణంతో చోటు చేసుకున్న పరిణామాలు అన్ని ఇన్ని కావు. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం సిత్రవిచిత్రంగా మారిపోవటటంలో అమ్మ మరణం కీలకమని చెప్పాలి. ఇదిలా ఉంటే.. జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో 2017 నవంబరులో జరిగిన వాచ్ మన్ హత్య.. దోపిడీకి సంబంధించిన మిస్టరీ లెక్క తేల్చేందుకు సీబీసీఐడీ రంగంలోకి దిగింది.ఈ వ్యవహారాన్ని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. మమా అన్నట్లుగా పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ విషయాన్ని స్టాలిన్ సర్కారు మాత్రం సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.ఇందులో భాగంగా అమ్మకు ఆప్తురాలు శశికళతో పాటు.. ఒక జ్యోతిష్యుడిని కూడా విచారించేందుకు వీలుగా నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి.. ఆయన సన్నిహిత మిత్రుడు ఇలంగోవన్ ను లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా పళనిస్వామికి భద్రతాధికారిగా పని చేసిన కనకరాజ్ ను తాజాగా అధికారులు విచారించారు.ఇదిలా ఉంటే పళనిస్వామికి డ్రైవర్ గా పని చేసి అనుమానాస్పదంగా మరణించిన ఉదంతాన్ని సీబీసీఐడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కొడనాడు ఎస్టేట్ వాచ్ మెన్ హత్య.. పళనిస్వామి డ్రైవర్ అనుమానాస్పద మరణంలో  ఒక జ్యోతిష్యుడికి ఉన్న లింకు లెక్క తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఈ వ్యవహారంలో శశికళను కూడా విచారించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎస్టేట్ వాచ్ మెన్ హత్య విషయంలో గతంలో శశికళ వద్ద వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. తాజాగా ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నారు.ఇదంతా చూస్తుంటే.. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కొడనాడు ఎస్టేట్ హత్యతో పాటు.. పళనిస్వామ డ్రైవర్ అనుమానాస్పద మరణాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం ఉందని  వినిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.