రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైకి వైఎస్ షర్మిల లేఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. పేపర్ లీక్‌లో ఐటీ విభాగం పాత్రపై సిట్‌ దర్యాప్తు నివేదిక కోరాలంటూ గవర్నర్‌కు షర్మిల విజ్ఞప్తి చేశారు.టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేస్‌లో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ 19 మంది అరెస్ట్ అయ్యారు. మహబూబ్ నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు మైసయ్య, జనార్దన్‌లను సిట్ అరెస్ట్ చేశారు. కొడుకు కోసం రెండు లక్షల రూపాయలు పెట్టి ఏఈ పేపర్‌ను తండ్రి కొనుగోలు చేశారు. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరినీ అరెస్టు చేసి సిట్ రిమాండ్‌కు తరలించింది.టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసు లో తవ్విన కొద్దీ లీకేజీలు బయటికి వస్తున్నాయి. తాజాగా.. డీఏవో (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) ప్రశ్నపత్రం కూడా లీకయి.. ఇతరుల చేతికి అందినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఏఈ, గ్రూప్‌-1, డీఏవో, టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ, ఎంవీఐ, గ్రౌండ్‌ వాటర్‌.. ఇలా మొత్తం 7 పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌ రాజశేఖర్‌రెడ్డిల పెన్‌డ్రైవ్‌, మొబైల్స్‌లో సిట్‌ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాంతో ఆ పరీక్షలన్నింటినీ టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. అయితే వీటిలో గ్రూప్‌-1, ఏఈ పరీక్షల ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇతరులకు విక్రయించినట్లు ఇప్పటిదాకా గుర్తించారు.ఈ మేరకు దర్యాప్తులో భాగంగా 15 మంది నిందితులను అరెస్టు చేసి లోతుగా విచారణ జరిపారు. ఈ క్రమంలోనే డీఏవో ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌.. ఖమ్మంకు చెందిన లౌకిక్‌, సుష్మిత అనే దంపతులకు విక్రయించినట్లు తేలింది. భార్య సుష్మిత కోసం భర్త లౌకిక్‌ ఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందుకోసం రూ.10 లక్షలకు ఒప్పందంద చేసుకొని.. ముందుగా రూ.6 లక్షలు ప్రవీణ్‌కు చెల్లించినట్లు నిర్ధారించారు. ప్రవీణ్‌ బ్యాంకు ఖాతా లావాదేవీల ఆధారంగా ఈ విషయాన్ని సిట్‌ అధికారులు తెలుసుకున్నారు.సుష్మిత గతేడాది అక్టోబరులో టీఎ్‌సపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష రాసి, మెయిన్స్‌కు క్వాలిఫై కాలేకపోయింది. ఆ తర్వాత డీఏవో పరీక్షకు సన్నద్ధమైంది. అయితే అప్లికేషన్‌ సబ్‌మిట్‌ చేసిన క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సుష్మిత తన భర్తతో కలిసి టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. దీనిని పరిష్కరించుకునే క్రమంలో వారికి కమిషన్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌తో పరిచయం అయింది.

Leave A Reply

Your email address will not be published.