టీఎస్‌పీఎస్సీ కేసులో హైకోర్టులో విచారణ

- విచారణ ఆలస్యంపై న్యాయస్థానం అసంతృప్తి - విచారణపై రిపోర్ట్ జూన్ 5లోపు సమర్పించాలని ఆదేశాలు జారీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్‌పీఎస్సీ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఏసీపీ నర్సింగరావు హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ కేసు దర్యాప్తు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణపై రిపోర్ట్ జూన్ 5లోపు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. సిట్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ ఆలస్యంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. కొంత ఆలస్యం అవుతుందని ఏజీ చెప్పారు. ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. సిట్ దర్యాప్తు కొంత వరకూ సంతృప్తిగా ఉందని హైకోర్టు అభిప్రాయ పడింది. అయితే దర్యాప్తు వేగంగా జరగడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. జూన్ 5న తదుపరి దర్యాప్తు పురోగతి నివేదిక ఇవ్వాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఎప్పటి లోపు దర్యాప్తు పూర్తి చేస్తారని సిట్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందని ఏజీ తెలిపారు. దర్యాప్తు మధ్యలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. టీఎస్పీఎస్సీలో ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించారా? అని ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు మెల్లగా నడుస్తున్నట్టు అనిపిస్తోందని పేర్కొంది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితడిగా ప్రవీణ్ గ్రూప్ 1 రాసేందుకు కమిషన్ అనుమతి పొంది ఎన్ఓసీ తీసుకున్నాడని హైకోర్టుకు ఏసీపీ నర్సింగ్ రావ్ తెలిపారు. ఏ – 16 ప్రశాంత్ రోల్ ఏంటని హైకోర్టు అడిగింది. దాక్యా నుంచి డబ్బులు పెట్టి పేపర్ కొన్న వాళ్లు మళ్లీ ఎవరికైనా అమ్మారా? అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.