చంద్రబాబు, వైఎస్ ల రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఎంత?

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : మునుగోడు ఉపపోరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎదుటోడి అహంకారాన్ని చెప్పాలనుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. చివరకు తన అహంకారాన్నే ప్రదర్శించారాఅన్నది ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా  మారింది. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇదే చెబుతున్నాయన్న మాట రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో తూటల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. ప్రత్యర్థులను మంట పుట్టేలా మాట్లాడుతున్నారు. మాటలతో ప్రత్యర్థులకు బీపీ పెంచే టాలెంట్ ఉన్న కేటీఆర్ తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట చేయటం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట కేటీఆర్ కు నెగిటివ్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.తెలంగాణలో ఒకప్పుడు చంద్రబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ప్రత్యర్థులు ఉండేవారు. వారిని ఒక మాట అనాలన్నా.. వారి నుంచి మాట పడ్డా ఒక పద్దతిగా ఉండేది.ఈ బోడిగాల్లు మాకు ఒక లెక్కనావాల్ల ముందు వీళ్లెంతఈ బఫూన్ గాళ్లతో కొట్లాడటం పెద్ద కష్టమేమీ కాదు‘ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు. ఎందుకంటే.. కేటీఆర్ ప్రస్తావించిన చంద్రబాబు.. వైఎస్ వారి రాజకీయ అనుభవం ఏమిటివారి స్థాయి ఏమిటిఅన్నది చూసినప్పుడు.. కేటీఆర్ మాటల్లోని అహంకారం ఇట్టే బయటపడిపోతుందని చెబుతున్నారు.చంద్రబాబు.. వైఎస్ లు ఇద్దరిని చూస్తే.. వారిద్దరూ కేసీఆర్ లాంటి నేతకే సీనియర్లు.. బాస్ లు. అలాంటి వారి మీద విమర్శలు చేసిన కేటీఆర్ కు అప్పట్లో ఉన్న స్థాయి ఏమిటిఈ రోజున ఆయన బీజేపీ నేతల్ని ఎలా అయితే బఫూన్లు.. బోడిగాళ్లు అంటున్నారో.. ఆయన్ను అప్పట్లో ఆ మాటలు అనలేదంతే. కారణం.. అప్పటి తరం నేతల్లో ఉన్న రాజకీయ పరిణితి. అలాంటి వారిని నోటికి వచ్చినట్లుగా అనేసి.. సెంటిమెంట్ రగిలించిన వైనాన్ని మర్చిపోయి.. ఇవాల్టి రోజున తమకంటే దారుణంగా మాట్లాడే వారిని చూస్తున్న కేసీఆర్ కు బాబు.. వైఎస్ లు గుర్తుకు వస్తున్నారు.తన స్థాయికి కోటి రెట్లు ఎక్కువైన వ్యక్తుల్ని ఉద్దేశించి కేటీఆర్ లాంటి పిల్ల నేత అప్పట్లో మాట్లాడిన మాటల్ని వైఎస్.. బాబు పెద్ద మనసుతో పట్టించుకోలేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. తనకు తాను తోపు నేతగా ఫీల్ అవుతూ.. తనను ఎవరూ ఏమీ అనకూడదని.. తనను అనే వారు తన స్థాయికి ఏ మాత్రం సూట్ అయ్యే వారు కాదన్న మాటలు అహంకారానికి నిలువెత్తు రూపంగా చెబుతున్నారు. వైఎస్.. చంద్రబాబుల ప్రస్తావన తీసుకురావటం ద్వారా తన స్థాయిని పెంచుకునేలా ఉన్న కేటీఆర్ మాటలు చూసినప్పుడు ఒక ఆసక్తికర విషయం మనసులోకి రాక మానదు.నిత్యం సీమాంధ్ర.. తెలంగాణ అంటూ విభజన రేఖలు గీసి మాట్లాడే కేటీఆర్  లాంటి వ్యక్తి.. తన నోటితో తాను తోపు నేతలుగా సీమాంధ్రకు చెందిన వైఎస్.. చంద్రబాబు(ఇప్పటికే ఎన్నోసార్లు కేటీఆర్ వారిని సీమాంద్ర నేతలుగా ప్రస్తావించారు కాబట్టే ఈ పోలికను పరిగణలోకి తీసుకున్నామన్నది మర్చిపోకూడదు) వారే గుర్తుకు రావటం ఏమిటితెలంగాణ వారు ఎవరూ లేరావారి ప్రస్తావన ఎందుకు తేరుసీమాంధ్రుల్ని గొప్పోళ్లుగా కీర్తించటం అంటే తెలంగాణ వారిని అవమానించటమేగాఅన్న ప్రశ్నలు రాక మానవు. కాదంటారా

Leave A Reply

Your email address will not be published.