రేవంత్ రెడ్డి చేసిది రంధ్రాన్వేష‌ణ

- తెలంగాణ‌ను భార‌త‌దేశంలో అగ్ర‌శ్రేణి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం       -  బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు పాల‌మూరు పౌరుషాన్ని చూపించాల‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ ట‌వ‌ర్‌తో పాటు ప‌లు అభివృద్ది ప‌నుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసిన అనంత‌రం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.ఎన్నిక‌లు స‌మీపంచే కొద్ది చాలా మంది టూరిస్టులు వ‌స్తారు.. మొన్న‌నే రేవంత్ రెడ్డి పాల‌మూర‌కు వ‌చ్చి మీటింగ్ పెట్టిండు. నోటికొచ్చినట్లు అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడారు. తెలంగాణ‌ను తెచ్చిన సీఎం, రెండు సార్లు ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డ సీఎం. కేసీఆర్‌ను గౌర‌వించ‌కుండా నోటికొచ్చిన‌ట్టు నీచ‌మైన మాట‌లు మాట్లాడిండు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏండ్ల‌లో 11 సార్లు అధికారం ఇచ్చారు. 11 ఛాన్సులు ఇచ్చిన‌ప్పుడు ఒక్క మంచి ప‌ని కూడా చేల‌యేదు. మంచినీళ్లు, ప‌రిశ్ర‌మ‌లు లేవు. సాగునీరు లేదు. క‌డుపు చేత పప‌ట్టుకుఒని వ‌ల‌స పోయేవాళ్లు. అలాంటి పాల‌మూరును అభివృద్ధి చేశాం. రేవంత్ రెడ్డి రంధ్రాన్వేష‌ణ చేస్తున్నారు. 55 ఏండ్లు ప‌రిపాలించింది నీ స‌న్నాసి పార్టీ. ఇక్క‌డ తెలంగాణ‌లో ఇంకా ఏమైనా ద‌రిద్రం ఉందంటే అది నీ పార్టీ దిక్కుమాలిన నాయ‌క‌త్వం వ‌ల్ల అని గుర్తు చేస్తున్నాను. ఆనాడు అధికారం ఇచ్చిన‌ప్పుడు అన్ని చేసి ఉంటే నేడు ఎందుకు స‌మ‌స్య‌లు ఉంటుండే. తెలంగాణ‌ను భార‌త‌దేశంలో అగ్ర‌శ్రేణి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. ఇక ఎన్నిక‌లు వ‌స్తే నిన్న‌టి వ‌ర‌కు లేని ప్రేమ‌ల‌ను ఇప్పుడు కురిపిస్తారు. 55 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేయ‌ని స‌న్నాసులు.. ఇప్పుడు చేస్తారా..? అనే విష‌యాన్ని ఆలోచించాలని కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

నిరుద్యోగ మార్చ్ అని మ‌రో స‌న్నాసి ఇక్క‌డ మీటింగ్ పెట్టిండు. 2014లో మోదీ పెద్ద పెద్ద మాట‌లు చెప్పిండు. రూ. 15 ల‌క్ష‌లు ఇస్తాన‌న్నాడు. కానీ ఇవ్వ‌లేదు. రూ. 15 ల‌క్ష‌లు ఇస్తాన‌ని చెప్పి మోసం చేసిన మోదీ ఒక దిక్కు ఉన్నాడు.. 15 ల‌క్ష‌ల మంది వ‌ల‌స‌లు ఆపి ఉపాధి క‌ల్పించిన కేసీఆర్ మ‌రో దిక్కు ఉన్నాడు. ఆలోచించి ఓటేయండి త‌ప్పా ఆగం కాకండి. పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామ‌ని ఇదే గ్రౌండ్‌లో మోదీ, అమిత్ షా చెప్పారు. మ‌రి ఇచ్చారా..? రాష్ట్రం ఏర్ప‌డి ఎనిమిదేండ్లు అవుతున్నా.. కృష్ణా న‌దిలో మ‌న వాటా, ఏపీ వాటా తేల్చ‌లేదు. దాని మీద ఇంత వ‌ర‌కు స్పంద‌న లేదు. రైతుల ఆదాయం పెంచ‌లేదు.. కానీ అదానీ ఆదాయం పెంచిండు. గుజ‌రాతోళ్ల చెప్పులు మోసేటోళ్లు మ‌న రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. గుజరాతీ గులామ్‌లు ఇక్క‌డ ఉన్నారు. కానీ రోషం క‌ల్ల తెలంగాణ బిడ్డ‌లు, పాల‌మూరు పౌరుషంతో ఉండే త‌మ్ముళ్లంతా ఆలోచ‌న చేయాలి. ఎవ‌రు ఈ రాష్ట్రానికి మంచివారు. ఎవ‌రి వ‌ల్ల ఈ రాష్ట్రంలోని రైతు బాగుప‌డుతాడు అనే విష‌యాన్ని ఆలోచించాలి. పెద్ద‌ల‌కు రుణాలు మాఫీ చేసే స‌న్నాసులు కావాల్నా.. పేద ప్ర‌జ‌ల క‌ష్టాల్లో అండ‌గా ఉండే కేసీఆర్ కావాల్నా ఆలోచించుకోవాలి. నెర్రెలు బారిన నేల‌లో, నెత్తురు కారిన తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే నీళ్లు వ‌స్తున్నాయి. ఈ దిక్కుమాలిన పార్టీల‌కు అవ‌కాశం ఇస్తే నెత్తురు కారే రోజులు తీసుకొస్తారు. మతం మంటల్లో ఉండే తెలంగాణ కావాల్నా.. ప‌చ్చ‌ని పంట‌ల‌తో ఉండే తెలంగాణ కావాల్నా.. రైతులు, ప్ర‌జ‌లు ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.