ప్రత్యేక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడుతోంది

-    సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రత్యేక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడుతోంది. ఇదేనా మేము కోరుకున్న తెలంగాణ అని యువత ప్రశ్నిస్తున్నారు’’ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. సరూర్నగర్లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో భట్టి మాట్లాడుతూ కొలువుల కోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఆత్మార్పణం చేసుకుంటుంటే చూడలేక.. కాంగ్రెస్ నేత సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. విద్యార్థులు, నిరుద్యోగులందరం ఏకం కావాలని, తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోసారి పిడికిలి బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఆశలు, ఆశయాలు సాధించుకుందామని, కేంద్రం నుంచి పరిశ్రమలు, వివిధ సంస్థలను తెచ్చుకోవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.