రైతుల పాదయాత్రలో వైసిపీ కార్యకర్త వీరాంగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమరావతి రాజధాని సాధన కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. బుధవారం 31వ రోజు కొనసాగుతోంది. ఇవాళ తణుకు మండలంవేల్పూరు నుంచి పాదయాత్ర సాగుతోంది. తణుకు నియోజకవర్గం నుంచి నిడదవోలు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. అమరావతి పాదయాత్ర హోరెత్తింది. జోరువానలోనూ రైతులు జై అమరావతి అంటూ నినదించారు. వందలాది మంది రైతులుస్థానికులు వారితో కలసి అడుగులో అడుగు వేశారు. వర్షం అవరోధం సృష్టించినా… అధికార పార్టీ కవ్వింపులకు పాల్పడినా ఒకే ధ్యేయంతో పాదయాత్ర ముందుకు సాగింది. రైతుల పాదయాత్రకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ నుంచి తణుకు నియోజకవర్గం వేల్పూరు వరకు మంగళవారం 30వ రోజు 15 కిలోమీటర్ల యాత్ర సాగింది. రైతుల పాదయాత్ర లో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. తణుకు మండలం వేల్పూరులో పాదయాత్ర జరుగుతున్న సమయంలో నల్ల జెండా ఊపి నిరసన తెలిపేందుకు వైసీపీ కార్యకర్త ప్రయత్నించాడు. దీంతో పాదయాత్ర చేస్తున్న కొందరు రైతులు ఆయనకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. దండం పెడుతూ వైసీపీ కార్యకర్తను ఆపేందుకు అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు  ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తరువాత వివాదం సద్దుమణిగింది.కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో నేటితో పాదయాత్ర ముగియనుంది. ఈరోజు వేల్పూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర వీరభద్రపురంమండపాకపైడిపర్రులో భోజన విరామం అనంతరం తణుకు చేరుకుంటుంది. పట్టణంలోని ఆర్వోబీవేంకటేశ్వర సెంటర్‌నరేంద్ర సెంటర్‌కేశవస్వామి గుడి సెంటర్‌ఉండ్రాజవరం జంక్షన్‌ఉండ్రాజవరం రోడ్డులోని పాలంగి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించి ఉండ్రాజవరం వద్ద ముగుస్తుంది. వీరికి రాత్రి బస కానూరులోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.