ఘనంగా  రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జయంతి ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథులు మన రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఎ. వి. యన్ రెడ్డి , ఎ. సి. పి రామదాసు తేజోవత్, టిబి-హైదరాబాద్  కన్వీనర్ డా. బి. విజయ్ భాస్కర్ గౌడ్ , ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రిన్సిపల్ , డా. డి. వరలక్ష్మి గారు,రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ , మహేంద్ర రెడ్డి గారు, పవన్ పుత్ర ఎంటర్ ప్రెజర్ యం. డి ఎ. వి రావు ,  విచ్చేశారు.  తెలంగాణ శాసన మండలి సభ్యులు ఎ. వి. యన్ రెడ్డి , జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో జే ఆర్ సి మరియు వై ఆర్ సి విద్యార్ధులకు హెన్రీ డ్యూనాంట్ జయంతి సందర్భంగా సర్టిఫికేట్ లను ఎ. వి. యన్  రెడ్డి , చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎ. వి. యన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచి సేవా భావాలను నేర్చు కోవాలని విద్యార్ధులకు సూచించారు. నా వంతు సహాయం గా రెడ్ క్రాస్ కు చేస్తాను అని తెలిపారు. ఎ. సి పి రామదాసు తేజోవత్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న భీమ్ రెడ్డి గారిని అభినందించారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరారు. చివరగా భీమ్ రెడ్డి మాట్లాడుతూ మీ అందరి సహాయ సహకారాలు ఉన్నంత వరకు ఈ కార్యక్రమాలు సేవాభావం తో ముందు తీసుకెళ్తామని మరియు మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి క్షయ వ్యాధి రోగులు కు విరాళాలు అందించి ప్రాణ దాత లు కావాలని పిలుపునిచ్చారు. భీమ్ రెడ్డి గారు ప్రత్యేకం గా ఠాగూర్ స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్ధులు కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా వైస్ చైర్మన్ విజయ కుమారి, యం సి సభ్యులు అనురాధ, రియాజుద్దీన్, వినయ్ కిశోర్, సందేష్ హార్డ, అరుణ్ రవి నాదన్, వై. ఆర్ సి కన్వీనర్ ఉదయ్ శ్రీ, జె.ఆర్ సి కన్వీనర్ కళావతి మరియు విద్యార్ధులు, డివిజన్ కన్వీనర్ ధర్మ తేజ, మండల కన్వీనర్ ఆయూభ్ ఖాన్, ప్రవీణ్ కుమార్, మాజీద్, జ్యోతి వాలంటీర్లు కార్యాలయ సిబ్బంది లక్ష్మి, వెంకట్, మహేంద్ర రెడ్డి, సత్య లక్ష్మి, మమత, అనిత, నహీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.