లైంగిక వేధింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షునికి 40 కోట్ల జరిమానా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్‌పై లైంగిక వేధింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. జర్నలిస్ట్‌పై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడి, పరువు తీశారంటూ అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది. ఈ కేసులో ఆమెకు 5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 41 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. విచారణలోని తొమ్మిది మంది న్యాయమూర్తులు జ్యూరీ.. జీన్ కారోల్ అత్యాచార ఆరోపణలను తోసిపుచ్చింది. కానీ, మూడు గంటల కంటే తక్కువ సమయం జరిగిన చర్చలో నిశితంగా పరిశీలించిన జ్యూరీ.. ట్రంప్‌పై ఆమె చేసిన ఇతర ఫిర్యాదులను సమర్ధించింది.అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై లైంగిక ఆరోపణల కేసులో తీర్పు వెలువడడం ఇదే మొదటిసారి. దశాబ్దాల నాటి లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు, డజను మంది మహిళలపై చట్టపరమైన కేసులను మాజీ అధ్యక్షుడు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో నష్టపరిహారం కోరుతూ కారోల్ ట్రంప్‌పై దావా వేసింది. కారోల్ చేసిన ఆరోపణలు తనకు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయన్న ట్రంప్ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, కోర్టు తీర్పుపై రిపబ్లికన్ నేత స్పందిస్తూ.. ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.కారోల్ లైంగిక వేధింపుల సమర్థవంతంగా నిరూపించినట్టు నిర్దారించిన జ్యూరీ.. ఇందుకు ఆమెకు $2 మిలియన్ డాలర్లు, పరువు నష్టం కింద 3 మిలియన్ డాలర్లు మొత్తం 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన జ్యూరీ ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత మాన్హాటన్ ఫెడరల్ కోర్టు వెలుపల చిరునవ్వుతో కనిపించిన ఆమె.. మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఆమె తరఫున లాయర్ మాత్రం మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.అయితే, తీర్పు సోషల్ మీడియాలో ట్రంప్ భగ్గుమన్నారు. ‘ఆ మహిళ ఎవరో తనకు తెలియదు… ఈ తీర్పు చాలా సిగ్గుచేటు.. అన్ని కాలాలల్లోనూ గొప్ప మంత్రగత్తె వేట కొనసాగింది’ అని విమర్శించారు. అమెరికా జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్ ఈ జీన్ కారోల్ (79) గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు విచారణ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌ తనపై విలాసవంతమైన డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో అత్యాచారం చేశాడని ఆరోపించారు. 1996లో ఓ రోజు సాయంత్రం బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్‌లో తాను ట్రంప్‌ను కలిశానని, అక్కడ ఓ మహిళలకు లో దుస్తులను కొనుగోలు చేయడంలో సహాయం చేయమని ట్రంప్ అడిగార చెప్పారు. దుస్తులు మార్చుకునే గదిలో తాను ఉండగా లోపలికి దూరి అత్యాచారం చేశాడని కారోల్ ఆరోపించారు.దశాబ్దాలుగా తన ఇద్దరు స్నేహితులకు తప్ప ఎవరికీ చెప్పలేదని, ట్రంప్ తనపై ప్రతీకారం తీర్చుకుంటాడని భయపడి ‘నా తప్పే అనుకున్నా’ అని చెప్పారు. తనకు జరిగిన దానికి ప్రజలు తనపై నిందలు వేస్తారనే భయం కూడా ఉందని కారోల్ వాపోయారు. ‘మీ టూ’ క్యాంపెయిన్‌ తర్వాత తనకు ఎదురైన కష్టాలను ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.ఈ ఆరోపణలను ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు. తనపై ఒక రచయిత చేసిన అత్యాచార ఆరోపణలను ‘అత్యంత హాస్యాస్పదమైన, అసహ్యకరమైన కథ’గా ట్రంప్ అభివర్ణించారు. మే 3న న్యూయార్క్‌లో వీడియో ద్వారా జ్యూరీకి ఇచ్చిన వాంగ్మూలంలో ట్రంప్ ఆ ఆరోపణలు ‘కల్పితం’ అని, మాన్హాటన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో రచయిత ఇ. జీన్ కారోల్‌పై తాను ఎప్పుడూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.