పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను మంగళవారం అవినీతికి కేసులో పారామిలటరీ బలగాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇమ్రాన్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్డుపై ఉన్న బస్సులను తగలబెడుతున్నారు. దీంతో పాక్‌ దేశవ్యాప్తంగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఇమ్రాన్‌ పార్టీ పిటిఐ పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఇమ్రాన్‌ను విడుదల చేసేంతవరకు ఆందోళనలు కొనసాగతాయని ఆ పార్టీ సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఉదయం 8 గంటలకే జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌ వద్దకు మద్దతుదారులు, కార్యకర్తలు చేరుకుంటారు. ఇమ్రాన్‌ విడుదలయ్యేంతవరకు వారి నిరసనలు కొనసాగుతాయని బుధవారం పిటిఐ పార్టీ ట్వీట్‌లో పేర్కొంది.కాగా, ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు చేయడం చట్టబద్ధమైనదేనని ఇస్లామాబాద్‌ హైకోర్టు తెలిపింది. దీనిపై పిటిఐ సీనియర్‌ నేత ఫహద్‌ చౌదరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ బెయిల్‌పై నిర్ణయం తీసుకోకుండానే.. అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని.. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక మంగళవారం ఖాదిరి ట్రస్టుకు సంబంధించిన అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.