బహిరంగంగా తిట్టుకున్న ఎమ్మెల్యేలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏకంగా ఎమ్మెల్యేలు ఇద్దరు బహిరంగంగా తిట్టుకోవడం సంచలనంగా మారింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది.

దమ్ముగూడెంలోని లక్ష్మీనగరంలో ఎమ్మెల్యేల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య మంత్రి సమక్షంలోనే మాటల తూటాలు పేలాయి. తునికి ఆకుల సేకరణ చెక్కుల పంపిణీ సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.

బహరింగ సభలో పాల్గొన్న రేగా కాంతారావు ప్రభుత్వం చేస్తున్న పథకాలు వివరించారు. ఈ క్రమంలోనే పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అడ్డుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. అలా ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకునే స్థితికి వెళ్లింది. ఈ వివాదం నడుస్తుండగానే అక్కడే కూర్చొని ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేచి పక్కకు వెళ్లిపోయారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దర్నీ విడిపించారు. ఈ గొడవ జరుగుతున్న టైంలోనే ఇరు నాయకుల అభిమానులు కూడా పెద్ద పెద్దగా వ్యతిరేక అనుకూల నినాదాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.