బంగారం బిస్కెట్లను మింగిన ప్రయాణికుడు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఇంతిజార్ అలీ అనే 30 ఏళ్ల యువకుడు దుబాయ్ నుంచి ముంబైకి విమానంలో వచ్చాడు. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అందరు ప్రయాణికుల లాగానే ప్రవర్తించాడు. అక్కడ తనిఖీలు చేస్తున్న కస్టమ్స్ అధికారులకు ఇంతిజార్‌పై అనుమానం వచ్చింది. అతడిని తనిఖీ చేయగా కడుపులో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి ఎక్స్ రే తీయగా ఇంతిజార్ కడుపులో బంగారం బిస్కెట్లు ఉన్నట్లు ధృవీకరించుకున్నారు. అందులో 7 బంగారం బిస్కెట్లను ఒక ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి మింగినట్లు గుర్తించారు. 240 గ్రాముల బంగారాన్ని ఆ వ్యక్తి కడుపులో నుంచి బయటికి తీశారు. దీంతో ఇంతిజార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తును చేపట్టారు.ఎందుకు అక్రమ రవాణామన దేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఆర్థికంగానే కాకుండా సామాజికంగానూ బంగారానికి మంచి విలువ ఉంటుంది. అయితే విదేశాల్లో తక్కువ ధరకు కొని.. వాటిని పన్నులు కట్టకుండా భారత్‌లోకి తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తుంటారు. దీంతో అలా అక్రమ మార్గాల్లో మనదేశంలోకి బంగారాన్ని తీసుకువస్తూ ఎయిర్‌పోర్టుల్లో దొరికిపోతూ ఉంటారు. కొందరు అధికారులకు దొరకకుండా ఉండేందుకు బంగారాన్ని.. దుస్తులు, చెప్పులు, షూలు, లో దుస్తులు, ప్రైవేటు భాగాల్లో పెట్టుకుని తీసుకువస్తారు.

Leave A Reply

Your email address will not be published.