నిప్పుల కొలిమిలా మారిన తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఈ నెల 25న రోహిణీ కార్తె మొదలవుతోంది. అప్పుడు ఎండలు మరింత పెరగడం ఖాయం. రోహిణీ కార్తె జూన్ 7 వరకూ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి.

శుక్రవారం వరకూ ఎండలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో పాటు వడదెబ్బ తగిలే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం రాత్రివేళ కూడా వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాకా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు నీరు తాగి వెళ్లాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ అరగంటకు ఓసారి నీరు, మజ్జిగ, నిమ్మరసం, పుదీనా రసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తీసుకోవాలి.

ఎండలో తిరిగితే మెదడు సరిగ్గా పనిచెయ్యదు. దానికి ఆక్సిజన్ సరిగా అందదు. బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది. కాబట్టి.. నీరు, ద్రవ పదార్థాలు తాగుతూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.