తమిళనాడు రాష్ట్రం మత్తులో మునిగి తేలుతోంది

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తమిళనాడు రాష్ట్రం మత్తులో మునిగి తేలుతోందని డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌విమర్శించారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కల్తీ సారా తాగి 15 మంది మృతి చెందడంపై విజయ్‌కాంత్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం చట్టాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటుచేసిన డీఎంకే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రజలు అభ్యంతరం తెలుపుతున్న ప్రాంతాల్లో టాస్మాక్‌ దుకాణాలు మూసివేయకుండా, తాజాగా షాపింగ్‌ మాల్స్‌లో కూడా ఎలైట్‌ వైన్‌ షాపుల్లో ఆటోమేటిక్‌ యంత్రాల ద్వారా విక్రయించడం దురదృష్టకరమని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌, కల్తీ సారా తదితరాలు అడ్డుకోవాల్సిన అధికారులు లంచాలు పుచ్చుకోవడంతో ఆ వ్యాపారం జోరుగా సాగుతోందని విజయ్‌కాంత్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.