కవిత్వం సమాజానికి ప్రయోజనకారి కావాలి

- రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: కవిత్వం  సమాజ ప్రయోజనకారి కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం  అధ్యక్షులురాజ్యసభ  సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. తెలంగాణ కవుల సంఘంబీసీ టీచర్స్ యూనియన్ కళాసూర్య సంస్థల సంయుక్త ఆద్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్ లోని జాతీయ బీసీ భవన్ నందు సుతారవు వెంకట్ నారాయణ అధ్యక్షతన పుస్తకావిష్కరణ సభ జరిగింది.ఈ కార్యక్రమానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కాళోజీ అవార్డు గ్రహీత డా. అమ్మంగి వేణుగోపాల్తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరంకళాసూర్య కల్చరల్ సంస్థ వ్యవస్థాపకులు అనుముల ప్రభాకరాచారి సమక్షం లో తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర కోశాధికారిదొంతరబోయిన  దైవాదీనం కాలం చెప్పిన కవితలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ కవులు సమాజానికి మార్గనిర్ధేశ కవిత్వాన్ని అందించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. కవిత్వం మారుతున్న కాలాను గుణంగా పరిణామ క్రమంలో ఉండాలన్నారు. కవులు కవిత్వంలో ప్రాచీన భారతీయ సంస్కృతుల సంప్రదాయాలు అవగాహనచేసుకుంటూ ప్రపంచీకరణ ప్రభావాలు ఆధునిక సమాజంపై ఎలా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని వివరించాలన్నారు. అవినీతి రహిత సమాజాన్ని దోపిడి పీడనకుల వివక్షత తొలిగినప్పుడే మనం పొందిన స్వాతంత్రానికి నిజమైన విలువన్నారు.ఈ కార్యక్రమం లో కవులు కొండా రవీందర్,తగిలి మహేశ్వరి,దొడ్ల విజయ యాదవ్,కుర చిదంబరం,మల్కని విజయ లక్ష్మి,డా.వడ్డేపల్లి కృష్ణ ,సుంకర రమేష్  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.