మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్

- మంత్రి తలసాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. మత్స్యశాఖ ఆధ్వరంలో జూన్ 8,9,10 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫెస్టివల్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధకమత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మత్స్య శాఖ అధికారులతో సమీక్షనిర్వహించారు.మంత్రి మాట్లాడుతూ ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ఫ్రై కర్రీ, బిర్యానీ, వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్ లో 20 నుంచి ౩౦ వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి చోట విజయ డెయిరీ కూడిన స్టాల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రిని ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఫెస్టివల్ కు వచ్చే వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలనునిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర పండుగను తలపించే విధంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలనిఇందుకోసం పశుసంవర్ధకమత్స్యడెయిరీ అధికారులతో పాటు గోపాలమిత్ర లకు కూడా భాగస్వాములను చేయాలని అన్నారు.అదేవిధంగా మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించాలని తెలిపారు. నూతనంగా లక్ష మందికి మత్స్య సొసైటీ లలో సభ్యత్వాలు కల్పించే విధంగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో  ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణఏర్పాట్లపై పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధర్ సిన్హామత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు. నూతనంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మన్ గా నియమితులైన పిట్టల రవీందర్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.