పండుగలా ముగిసిన సీఎం కప్‌ మండల స్థాయి టోర్నమెంట్ సంబురాలు

- జాతరల ను తలపింపచేసిన మండల స్థాయిపోటీలు -  జిల్లా టీంల ఎంపిక ప్రక్రియ పూర్తి - ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు -  ధన్యవాదాలు తెలియజేసిన సాట్స్  చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ క్రీడా నైపుణ్యాన్ని మరింతగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ‘సీఎం కప్‌ ` 2023’ పోటీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో దిగ్విజయంగా ముగిసాయి.మే 15, 16, 17 తేదీలలో మండల స్థాయిలో జరిగిన ఈ పోటీలకు పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చారు.ఎండ తీవ్రతను గమనించి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.ప్రతి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లోచోట్ల శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రీడాకారులకు ఏ లోటు రాకుండా సకల సౌకర్యాలు కల్పించారు.

2 లక్షల మంది క్రీడాకారుల భాగస్వామ్యం

రాష్ట్రాల్లోని దాదాపు 618 మండలాల్లో జరిగిన ఈ పోటీలలో ప్రతి మండలంలో 5 క్రీడాంశాలలో అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖో`ఖో, ఫుట్‌బాల్‌ పురుషులు మరియు మహిళ విభాగాల్లో కలిపి దాదాపు 2 లక్షల మంది భాగస్వాములైనట్టు అందులోంచి దాదాపు 85000 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు నివేదికలు అందాయి.అన్ని మండల కేంద్రాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు,సీనియర్ క్రీడాకారులు ఈ పోటీల్లో భాగస్వాములు అయినారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల క్రీడాకారులు పాల్గొనే విధంగా, వారి ప్రతిభకు గుర్తింపు లభించేలా ఈ టోర్నీలు ఎంతో ఉపయుక్తకరంగా ఉన్నాయని పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అతి పెద్ద క్రీడా పండుగ లాగా గ్రామ గ్రామాన నుంచి క్రీడాకారులు తరలివచ్చి ఈ పోటీలో పాల్గొనడం క్రీడా మైదానాలన్నీ జాతర కేంద్రాలను తలపింపజేశాయి.క్రీడాకారులు ఎందరో తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు.పోటాపోటీగా సాగిన ఈ సీఎం కప్ మండల స్థాయి పోటీలు క్రీడాకారుల సంబురాల మధ్యన ముగిసాయి.మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికి, అట్టడుగున ఉన్న గ్రామీణ క్రీడా ప్రతిభను గుర్తించి వాన్ని ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న సీఎం కప్ 2023 మొదటి అంచె పోటీలు మండల స్థాయి  దిగ్విజయంగాముగిసాయి.ఇదిలా ఉండగా జిల్లా స్థాయి పోటీలు మే 21, 22, 23 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాలను ఆయా జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు మరియు పలు ముఖ్య శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) తగువిధంగా సమన్వయం చేస్తుంది.*మండల స్థాయి పోటీలు విజయవంతంచేసిన ప్రతి ఒక్కరికి సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.మండల స్థాయి పోటీలు విజయవంతం కావడానికి దోహదం చేసిన మండల పరిషత్తు చైర్మన్లు మండల అభివృద్ధి అధికారులకు జడ్పిటిసి లకు వివిధ శాఖల అధికారులకు స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సాట్స్  చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తరలించి  చక్కగా పోటీలు నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి జిల్లా స్థాయి పోటీలు మరియు రాష్ట్రస్థాయి పోటీలలోకొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.