జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంధ్రప్రదేశ్ మహిళా ప్రధాన కార్యదర్శిగా సుకన్యా రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గుంటూరు కు చెందిన ప్రముఖ సంఘ సేవకురాలు, వినియోగ హక్కుల ఉద్యమ మహిళానేత, పండ్రంగి లక్ష్మి సుకన్యా రావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈబిసి విబాగం అంధ్రప్రదేశ్ మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు.ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య చేతులమీదుగా హైదరాబాద్ లోని సంఘం  ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రాన్ని  అందుకున్నారు. ఈ సందర్బంగా  కృష్ణయ్య మాట్లాడుతూ  మహిళలు రాజకీయంగా ,సామాజికంగా,ఆర్దికంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.ముఖ్యంగా బిసి మహిళలు ముందుకు రావలసిన ఆవశ్యకత  ఎంతో ఉందన్నారు. సుకన్య ఈ పదవిలో మరింత రాణించి వర్ధమాన రాజకీయ నాయకత్వంలో కూడా పైకెదగాలని ఆయన అభిలాషించారు. కార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్ లయన్ బాబు మిరియం నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ లోగోస్ అసోసియేషన్ మాట్లాడుతూ పేదలకు బలహీన వర్గాలకు విద్యార్థులకు దివ్యాంగులకు వయోవృద్దులు, కార్మికులకు మరిన్ని సేవలు అందించాలని సుకన్య రావుకు సూచించారు. అనంతరం లక్ష్మి సుకన్యా రావు మాట్లాడుతూ సామాజికంగా రాజకీయంగా మహిళల్లో చైతన్యం తేవడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై గల నమ్మకం తో తనకు ఈ పదవిని ఇచ్చిన ఆర్ కృష్ణయ్య, అందుకు సహకరించిన  డాక్టర్ లైన్ బాబు మిరియం లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ పదవి తో తనపై మరింత బాద్యత పెరిగిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.