అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ అభివృద్ధిసంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్తాన్ నారాయణపురంలో ఉప ఎన్నికల ప్రచారంమండల కేంద్రంలోని పార్టీ శ్రేణులుముఖ్య కార్యకర్తలుపోలింగ్ బూతుల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా జన సమీకరణ ఏర్పాట్లపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా వాటి పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలని శ్రేణులకు సూచించారు.టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖరారు అయిందనిమెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిగాదరి కిషోర్సంస్థాన్ నారాయణపూర్ జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశ్‌ఎంపీపీ గుత్తా ఉమాదేవిసర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరిఫాక్స్ చైర్మన్ జంగారెడ్డిటీఆర్ఎస్ నేతలు తెలంగాణ బిక్షంచిలువేరు బిక్షంరాముశంకర్పల్లె గోవర్ధన్ రెడ్డికరీంనగర్ కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.