బిసి సమస్యలపై నిష్పక్షపాతంగా పరిశీలించి తగు చర్యలు తెసుకోండి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ క్రింది సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తుంది. వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకొని తగు ఆదేశాలు జారీ చేయాలని జాతీయ బీసీసంక్షేమసంఘం అధ్యక్షులు  రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి కే.చంద్ర శేకర్ రావు కు లేఖ రాసారు. ఇటీవల తమరు పని ఒత్తిడి వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయం మీరు దృష్టిలో ఉందో లేదో తెలియడం లేదు. ఈ బీసీ వ్యతిరేక చర్యల వలన బీసీలకు అన్యాయం జరుగుతుంది. వీటిని నిష్పక్షపాతంగా  పరిశీలించి తగు చర్యలు తీసుకొని బిసి అభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు బీసీల సమస్యలపై ఉన్నత స్థాయి సమావేశం జరిపి పరిష్కరించాలని విజ్ఞప్తి చేసారు.బీసీ కార్పొరేషన్ ద్వారా గత 9 సంవత్సరాలుగా బి.సి.లకు రుణాలు ఇవ్వడం లేదు. ఇంత అన్యాయం గతంలో ఎప్పుడూ జరుగలేదు. 2017 ఎన్నికల ముందు రుణాలు ఇస్తామని 5 లక్షల 77 వేల దరఖాస్తులు తీసుకున్నారు. కానీ రుణాలు ఇవ్వలేదు. గతంలో 2014కు ముందు ప్రతి నెలప్రతిరోజు రుణాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు.ఇప్పుడు కూడా SC కార్పొరేషన్ – ST కార్పొరేషన్ – మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారు కానీ బీసీ కార్పొరేషన్ ఇవ్వడం లేదంటే ఇది బీసీ వ్యతిరేక చర్య కదా! అని కృష్ణయ్య ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.