భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జ‌నాలు ఉక్కిరి బిక్కిరి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భానుడి భ‌గ‌భ‌గ‌ల‌కు జ‌నాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉద‌యం 10 త‌ర్వాత బ‌య‌ట‌కు రావాలంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కూడా ఎండ‌లు మండిపోతున్నాయి. దీంతో ఉక్క‌పోత‌తో వృద్ధులుచిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ప‌లు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.న‌ల్ల‌గొండ జిల్లా నిడ‌మ‌నూరులో అత్య‌ధికంగా 45.9 డిగ్రీలు న‌మోదు కాగాక‌రీంన‌గ‌ర్ జిల్లా తంగ‌ల‌లో 45.6 డిగ్రీలుసూర్యాపేట జిల్లా గ‌రిడేప‌ల్లిలో 45.4 డిగ్రీలుఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లిలో 45.1 డిగ్రీలుజ‌గిత్యాల జిల్లా ధ‌ర్మ‌పురిలో 44.5 డిగ్రీలువ‌న‌ప‌ర్తి జిల్లా కానాయ‌ప‌ల్లిలో 44.4 డిగ్రీలుకుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌతాల‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.