స్పైడర్ మాన్ గా మారిన శుబ్ మాన్ గిల్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: శుభ్‌మాన్ గిల్‌.. ఐపీఎల్‌ 2023లో బాగా వినిపిస్తోన్న పేరు. గుజరాత్‌ జెయింట్స్‌ ఓపెనర్‌గా పరుగుల వర్షం కురిపిస్తోన్న గిల్‌ టీమిండియా ఫ్యూచర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవలే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మీద సెంచరీ చేసి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడీ యంగ్‌ ప్లేయర్‌. తాజా సీజన్‌లో ఇప్పటివరకు 576 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా అంచనాలకు మించి రాణిస్తుండడంతో గిల్‌ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈక్రమంలో ఇటీవలే హాలీవుడ్‌ యానిమేషన్‌ మూవీ స్పైడర్ మ్యాన్ కి హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. తద్వారా హాలీవుడ్‌ ఫ్రాంఛైజీలకు చెందిన ఓ సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న తొలి క్రీడాకారుడిగా శుభ్‌మాన్‌ రికార్డుల కెక్కాడు. తాజాగా ఇదే స్పైడర్‌ మ్యాన్‌ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మరోసారి సందడి చేశాడీ యంగ్ క్రికెటర్‌. ఈ సందర్భంగా సూటు, బూటు ధరించి ఎంతో హ్యాండ్‌సమ్‌గా కనిపించిన గిల్‌ స్పైడర్ మ్యాన్ తరహాలో కారు మీదకెక్కి కొన్ని ఫోజులు ఇచ్చాడు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2018లో వచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌ : ఇన్‌టు ది స్పైడర్‌-వెర్స్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘స్పైడర్‌ మ్యాన్‌: అక్రాస్‌ ది స్పైడర్‌-వెర్స్‌’ను రూపొందించారు. భారత్‌లో ఈ సినిమాను సోనీ పిక్చర్‌ విడుదల చేస్తోంది. జూన్‌ 2న ఈ చిత్రం ఇంగ్లిష్‌తో సహా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ తదితర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక శుభ్‌మాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ కి చేరుకుంది. డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు ఈసారి కూడా టైటిల్‌ వేటలో ముందంజలో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హార్దిక్ సేన అగ్రస్థానంలో ఉంది. ఇక ఆదివారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.

 

Leave A Reply

Your email address will not be published.