ఏ ఎస్ ఆర్ విద్యా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ASR ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం దేశాయిపేట్ గ్రామంలో ASR విద్యా కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ దుద్దాల అంజిరెడ్డి ప్రారంభించారు.
ముఖ్య అతిధిగా హాజరై దుద్దాల అంజిరెడ్డి  మాట్లాడుతూ ASR విద్యా కేంద్రాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని,చదవడం రాయడం ,గణితం తదితర అంశాలు నేర్చుకోవాలని,చదువులో వెనకబడిన వారికి ఇదొక మంచి అవకాశంగా తీసుకుని, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువుపై దృష్టి వహించాలని, ఎండలు ఎక్కువగా ఉన్నందున మద్యాహ్నం నుండి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి హోమ్ వర్క్ చేసుకుంటూ ఉండాలని అన్నారు.అదేవిధంగా ప్రతి రోజు ఉదయం ఉచిత తరగతులు నిర్వహిస్తునందుకు ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ mpp ప్రకాష్,ASR ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంతోష్,
అంబేద్కర్ సంఘం అధ్యక్షులు న్యాలకంటి చిన్న గంగారం,డాక్టర్ రాములు,మోచి రాములు,గరుగళ్ల బాలయ్య,జంగం ప్రేమ్ కుమార్,మారపు సాయిలు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.