జ్ఞానవాపి మసీదు‘శివలింగం’ కార్బన్ డేటింగ్‌ ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం’ వయసును శాస్త్రీయంగా నిర్ణయించాలనికార్బన్ డేటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సర్వేలో ఈ శివలింగం’ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఫౌంటెన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది.జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. శివలింగం’ వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసానాలనుబట్టి చూసినపుడుదీనిపై మరింత లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉందని తెలిపింది. హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.వారణాసిలోని కాశీ విశ్వనాధుని దేవాలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది

Leave A Reply

Your email address will not be published.