బీసీలకు లక్షరూపాయలు సరే.. దరఖాస్తు చేసిన 5లక్షల మంది సంగతేమిటి?

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కులవృత్తులు చేసుకునే బీసీ లకు ఒక లక్ష రూపాయలు ఇస్తామని  ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షనీయమని కాని, గత ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామని చెప్పడం దరఖాస్తు చేసుకున్న 5లక్షల 77వేల మందికి  ముందుగా ఒక లక్ష రూపాయలు ఇచ్చి మాట నిలుపుకోవాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు.శుక్త్రవరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, జాతీయ బిసి సంక్షేమ సంఘం, స్టేట్ ప్రెసిడెంట్  యెర్ర సత్యం ,రాష్ట్ర కన్వినర్ లాల్ కృష్ణ సి,రాజేందర్ లతో కలిసి మాట్లాడారు. గతంలో 2018 ఎన్నికలకు ముందు రుణాలు ఇస్తామని ప్రకటించిన 5లక్షల 77వేల మంది వద్ద దరఖాస్తులు తీసుకున్నారు. ఒక్కరికి ఒక లక్ష నుంచి 20 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించి దరఖాస్తులు తీసుకున్నారు. కానీ 5సంవత్సరాలు గడిచిన ఒకరికి కూడా రుణం ఇవ్వలేదు. నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఈ పెండింగు దరఖాస్తుదారులకు ముఖ్యమంత్రి ప్రకటించిన లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇవి ఇలాగే పెండింగ్ లో ఉంచి కొత్త దర-  గతంలో ఒక సంవత్సరం 10 నెలల క్రితం ముఖ్యమంత్రి బిసిలకు బి.సి బందు పధకం పెట్టి 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. దానికి అతి – గతి లేదు. “బీసీ బందు” పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు.కేవలం ఖాస్తులు తీసుకుంటే ప్రజలు నమ్మరని అది ఆచరణలో అమలుచేయాలన్నారు.అన్నారు.

–       బీసీ కార్పొరేషన్,ఎంబిసి  కార్పొరేషన్ 12 బీసీ కులాల ఫెడరేషన్లకు, చైర్మన్లను పాలక మండళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఇప్పటివరకు అనేక బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. వీటి మార్చుకోవాలని కోరారు.-  స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22శాతంకు  తగ్గించారు.-  కేంద్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడంతో రుణాలు నిలిచిపోయాయి.

అనేక పోరాటాల – ఉద్యమాల తర్వాత 271 బీసీ గురుకులాలు మంజూరు చేశారు. కానీ ఒక్కదానికి సొంత భవనం నిర్మించలేదు. అలాగే రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టల్ లో నడుస్తున్నాయి. కానీ ఒక్క సొంత భవనం నిర్మించడం లేదు. సచివాలయం కూలగొట్టి కొత్త సచివాలయం నిర్మించారు. కలెక్టర్ కార్యాలయాలునిర్మించారు. వేలకోట్ల వెచ్చించి ఫ్లై ఓవర్సు, స్కై ఓవర్స్ ,అండర్ వైన్స్ నిర్మించారు. కానీ భావి భారత పౌరులు అంబేద్కర్ వారసులకు  ఒక్క హాస్టల్ భవనం, ఒక గురుకుల పాఠశాల నిర్మించలేక పోవడంలో యున్న ఆంతర్యం ఏమిటని కృష్ణయ్య  ప్రశ్నించారు.-        అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసి ఆ పధకంకు నీరు గార్చి తగ్గించి 35 వేలకు పరిమితం  చేశారు. ఎస్సీ/ ఎస్టీ/ మైనార్టీ వర్గాలకు పూర్తి ఫీజులు ఇస్తూ బీసీలకు ఇవ్వకపోవడం బీసీ వ్యతిరేక కాదాయని ప్రశ్నించారు.

మంత్రివర్గంలో ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 11 మంది బీసీలు మంత్రులు ఉన్నారు. అది చూసి కూడా తెలంగాణలో బిసి లకు న్యాయం చేయాన్న ద్యాస లేదా అని ప్రశ్నించారు. బీసీ శాఖలతో బీసీ వ్యతిరేక అధికారులతో నిండిపోయింది. బీసీ గురుకులాలకు IAS ఆఫీసర్ ను నియమించడం  లేదు. ఒకే అనర్హుడైన అధికారి బిసి కానీ వ్యక్తిని  బిసి గురుకులాల్లో 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. బీసీ కానీ వ్యక్తిని నియమించడం వల్ల బిసి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి పెషిలో  ఒక్క బీసీ అధికారి లేరు. అందుకే బి.సి.లకు అన్యాయం జరిగిందన్నారు. బీసీ కమిషనర్ పోస్ట్ 2 సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు. కమిషనర్ లేకుండా పాలన ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్ MD – పోస్ట్ 5 సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు. MD లేకుండా కార్పొరేషన్లు ఎలా నడుస్తాయన్నారు.ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎప్పుడు నెలల తరబడి దీర్ఘ కాలిక సెలవులపై వెళ్ళారు. కమిషనర్ లేడు – సెక్రటరీ లేడు – డిపార్ట్మెంట్ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు. అలాగే బీసీ శాఖ నిర్వీర్యం అయింది దీనికి వెంటనే అన్ని స్థాయిలలో ఆఫీసర్లను వెయ్యాలని కోరారు.-      తమరు 19 ప్రైవేట్ యూనివర్సిటీలు మంజూరు చేశారు. కానీ ఇందులో ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లు ఎత్తివేశారు. ఒకవైపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి దేశంలోనే రికార్డ్ సృష్టించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దేశానికి అధర్శంగా నిలిచారు. కానీ అంబేద్కర్ పెట్టిన ఎస్సీ/ ఎస్టీ/బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు. దీనిలో నిజాయితీ ఏమిటి?-        ప్రస్తుతం ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఇస్తున్న స్కాలర్ షిప్పులు, మెస్ చార్జీలు 6సంవత్సరాల క్రితం వీటి ధరల ప్రకారం నిర్ణయించారు.  బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా 3నెలల క్రితం పెంచుతున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఒక్క జీవో జారీ చేయలేదు. అంబేద్కర్ వారసులు అర్టాకాలితో అలమటిస్తుంటే మీకు జాలి కలగడం లేదా! అని అన్నారు. బీసీలను విద్యా,ఉద్యోగ,ఆర్థిక,రాజకీయ రంగాలలో సర్వేతో మూఖాభివృద్ధికి తమ అధ్యక్షతన 2017 డిసెంబర్ 2 – 3 తేదీలలో బీసీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.  220 తీర్మానాలు చేశారు. ఒక్క తీర్మానమైన అమలు చేశారా అనిం ప్రశ్నించారు.   ఇప్పటికైనా ముఖ్యమంత్రికెసిఆర్  ఉన్నత స్థాయి సమావేశం బిసి సంఘాలు, MLA,MLC, లతో ఏర్పాటు చేసి, చర్చించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బి.సి ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.