ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో సోమవారం అప్పులబాధతో ముగ్గురు రైతులు బలవన్మరణం చెందటం పట్ల ధర్మ చక్రం సంస్థ అధ్యక్షురాలు యామిని లక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్త చేసారు.రైతుల ఆత్మ హత్యలకు పూర్తి భాద్యత రాష్ట్రప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లకావతండాలో రైతు లకావత్ రవి (45) రెండున్నర ఎకరాల్లో పత్తి, మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం కొంత, ఇద్దరు కుమార్తెల వివాహానికి మరికొంత అప్పు చేశాడు. పంటలు సరిగా పండకపోవటంతో అప్పులు తీర్చలేమోనన్న బెంగతో పురుగుల మందు తాగాడు. హనుమకొండ జిల్లా పరకాలలో గందెసిరి రాజు (40) కుమార్తె వివాహం కోసం మూడు లక్షల రూపాయల అప్పు చేశాడు. పంట దిగుబడి రాక పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చేలేనే మోనన్న బెంగతో పురుగుల మందు తాగాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో తాటికొండ రాయమల్లు (70) పెట్టుబడి కోసం చేసిన ఐదు లక్షల రూపాయల అప్పు చెల్లించలేననే బెంగతో ఉరేసుకున్నాడు. కాగా, నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరులో కౌలు రైతు ప్రవీణ్ కుమార్ (38) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలం వద్ద ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని తెలిపారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించి చనిపోయిన రైతు కుటుంబాలని ఆదుకోవాలని యామిని లక్ష్మి డిమాండ్ చేసారు. అదే విధంగా రైతుల్లో జీవితం పట్ల భరోసా ఇవ్వాలని… అస్సలు ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని.. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని…. తెలియచేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రైతు సదస్సుల్లో వారికీ అవగాహన కల్పించి దీశానికి వెన్నుముఖ ఐనటువంటి రైతులని కాపాడుకోవాలని చెప్పారు.రైతు అప్పులని ప్రభుత్వమే ఋణ మాఫీ చేస్తుందని వారికీ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.