హైదరాబాద్ లిబర్టి శ్రీవేంకటేశ్వరస్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్ లోని లిబర్టి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానములచే (టిటిడి) నిర్మించబడిన కలియుగదైవం శ్రీవద్మావతి గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా నిర్వ హిస్తున్నామని టిటిడి లోకల్ అడ్వయిజరి కమిటి తెలిపింది. శనివారం దే వాలయం ఆవరణలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటి అధ్యక్షుడు జి.వి.బాస్కర్ రావు కమిటి ఉపాధ్యక్షులు వై.రవి ప్రసాద్,కొమటి రెడ్డి లక్ష్మి,కొమ్మెర వెంకట్ రెడ్డి,ఆలయ కార్య నిర్వహణాధి కారి ఎం. రమేష్ బాబు లతో కలిసి బ్రహ్మోత్సవాలపోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం జి.వి.బాస్కర్ రావు మాట్లాడుతూ 26వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తిలిపారు. 27 ఉదయం ధ్వజారోహణం జరుగుతుందని అనంతరం శేష వాహనంపై శ్రీపద్మావతి గోదాదేవి. మన మేత శ్రీవారి ఊరేగింపు జరుగుతుందనిసాయంత్రం 8 గంటలకు శ్రీహనుమంతవాహనంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుందన్నారు. 28వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు10 గంటలకు న్నవన తిరుమంజనంరాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు29న గజ వాహనంపై శ్రీవారి ఊరేగింపు10 గంటలకు శాంతి కళ్యాణంరాత్రి 8 గంటలకు గరుడవాహనంపై ఊరేగింపు30వ తేదీ ఉదయం రథోత్సవంసాయంత్రం అశ్వవాహనంపై ఊరేగింపు31న ఉదయం మహాపూర్ణాహుతిచక్రసాన్నంసాయంత్రం 6 గంటలకు వుష్పయాగం9 గంటలకు ధ్వజ | “వరోహణం జరుగుతాయని వారు వివరించారు. పై కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి రోజు ఉదయంమధ్యాహ్నంసాయంత్రం అన్నప్రసాద వితరణ జరుగుతుందని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 150 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ దైవ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నామని జి.వి. సుబ్బారావు తెలిపారు.ఈ సమావేశం లో కమిటి సబ్యులు కే.భోజి రెడ్డి,బి.వెంకట రమనా రెడ్డి,కే.కృష్ణ మోహన్ తదితరులు హాజరైనారు. 

Leave A Reply

Your email address will not be published.