అడ్మిషన్ల పేరుతో ఇబ్బందులకు గురి చేసే పాఠశాలల లైసెన్సులను రద్దు చేయాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  అడ్మిషన్ల పేర్లతో తల్లితండ్రులను ఇబ్బంది పెట్టే స్కూల్స్ కి వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని  బిసి మహిళా నాయకురాలు మట్ట జయంతి డిమాండ్ చేసారు. తల్లిదండ్రుల కష్టపడి లక్షల రూపాయలు అప్పులు తెచ్చి మరి పిల్లల్ని చదివిస్తూ ఉంటే అధికంగా ఫీజు రూపంలో వసూలు చేస్తున్నటువంటి స్కూల్స్ కి మరియు కాలేజీలకు నోటీసు ఇవ్వాలని,ఐనా వారు  వినని పక్షంలో వాళ్ల లైసెన్స్ రద్దు చేయాలన్నారు. పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవాలి అనే ఉద్దేశంతో ఉన్న తల్లిదండ్రులు వడ్డీలకి డబ్బులు తెచ్చి మరీ చదివిస్తున్నారు కానీ అడ్మిషన్ల పేరిట లక్షలు వసూలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆకలి తీరడం లేదు పిల్లల్ని ఇబ్బంది వాళ్లకి పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారని ప్రశ్నించారు. పిల్లలకి ఇబ్బంది కలగకుండా కొత్త జీవో రావాలని, ఫీజులకు సంబంధించి తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడాలి చిన్న వయసులో పిల్లల్ని ఫీజుల గురించి ఇబ్బంది పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే స్కూల్స్ గాని కాలేజ్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జయంతి డిమాండ్ చేసారు. చాలావరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా రాకపోవచ్చు  ఈ మధ్యన చాలామంది ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులను చాలా మందిని చూసాం అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది విద్యాశాఖ మంత్రి ఈ విషయంలో పూర్తి చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.