అమర వీరుల స్మృతివనం అమరవీరుల ఫోటోలు చరిత్రను పెట్టాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర సచివాలయం ఎదుట నిర్మించి జూన్ 2 వతేదిన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంబించబోయే అమర వీరుల స్మృతివనం అమర్ర జ్యోతి లో అమరవీరుల ఫోటోలు చరిత్రను పెట్టాలని అమరవీరుల కుటుంబాలు ముఖ్యమంత్రి కే.చంద్ర శేకర్ రావు కు విజ్ఞప్తి చేసారు.ఈ మేరకు శుక్రవారం స్మృతివనం అమర జ్యోతి లో అమరవీరుల ఫోటోలు చరిత్రను పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రాంతి దళ్ ఆద్వర్యం లో నాంపల్లి గన్ పార్క్ అమరవీరుల స్తూపం నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా  తెలంగాణ క్రాంతి దళ్ రాష్ట్ర అధ్యక్షులు సంగంరెడ్డి పృద్వి రాజ్ మాట్లాడుతూ జూన్ రెండో తారీఖున తెలంగాణ అవతరణ దినోత్సవ రోజు తెలంగాణ కోసం తమా జీవితాలను త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాలని నిర్మిస్తున్న అమర జ్యోతి అమరవీరుల ఫోటో లు లేకుండా కేవలం ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం అన్యాయమన్నారు. తెలంగాణా ఉద్యమ పోరాటం లో 1200 మంది ప్రాణ త్యాగాలు చేసారని కాని వీరిలో ప్రభుత్వం 589 మందిని గుర్తించిందన్నారు.వీరి కుటుంబాల ను ఆడుకోడానికి , వారి బాగోగులకోసం జి.ఓ.నంబెర్ 80 తెసినప్పటికి నేడు దానిని కుడా రద్దుచేయడం దుర్మార్గామన్నారు. అమరవీరుల త్యాగాలు గుర్తుండే విదంగా భైరాన్ పల్లి మాదిరిగా కనీసం 589 మందికి సంబందించిన  అమర జ్యోతిలో తెలంగాణ అమరవీరుల ప్రతి ఒక్కరి చరిత్ర  ఫోటో ఉండాలని ఆయన డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో అమరుల కుటుంబ సభ్యులు బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోల్క వెంకట్ యాదవ్, తెలంగాణ క్రాంతి దళ్ సభ్యులు మీడియా మిత్రులు మన తొలి వెలుగు రఘు, కాలేజీ టీవీ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.