కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో  బీసీ నేతల భేటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  బి.సి కులగణన చేపట్టాలని, 75 కోట్ల మండి బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, 75 సంవత్సరాలుగా ఈ దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని బీసీలకు న్యాయం చేయడానికి కేంద్ర మంత్రులు అందరూ  జోక్యం చేసుకోవాలని కోరుతూ జాతీయ బీసీ సంఘం నాయకులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బి.సి నాయకులు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. జరిపారు.

 కేంద్రమంత్రి  హామీ :

 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు అన్నీ రంగాలలో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయినధని, స్వయానా ప్రధానమంత్రే  బి.సి, అలాగే కేంద్రమంత్రి వర్గంలో 27 మంది మంత్రులు బి.సి వర్గానికి చెందిన వారున్నారు. ఈ డిమాండ్లు న్యాయమైనవి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి, బి.సి.ల బడ్జెటు పెంచడానికి తన వంతు పాత్రగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  ఇంకా పూర్తి స్థాయి న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రతినిధి వర్గంలో గుజ్జ కృష్ణ, భూపేష్ సాగర్, నందగోపాల్, రామ కృష్ణ, రాజ్ కుమార్, వరప్రసాద్, రాకేశ్, లలిత ముదిరాజ్  తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.