కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం గీత బంధు ప్రకటించాలి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్:

కామారెడ్డిలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో. కల్లుకార్మిక సంఘం జిల్లా 2వ. మాహాసభలు ఎస్ వెంకట్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించాఋ.  ఈ సభకు ముఖ్య అతిథిగా కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.
కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీతకార్మికులకు గీతన్న బంధు ప్రకటించి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారని వీరికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లు కు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు. పెన్షన్ 5 వేలకు, రైతు బీమా తరహాలోనే ఎలాంటి షరతులు లేకుండా కల్లుగీత కార్మికులందరికీఎక్స్గ్రేషియా పది లక్షలకు పెంచి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో కల్లు దుకాణాల పైన గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న దాడులను అరికట్టాలని వారిపై ప్రభుత్వంచర్యలుతీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని తదితర 20 డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట లో జరిగే భారీ సభకు వేలాదిగా తరలి రావాలని కోరారు. 20, 21వ తేదీలలో రాష్ట్ర మూడవ మహాసభ నిర్వహిస్తున్నామని దీనికి అన్ని జిల్లాల నుండి సంఘం నాయకులు, ప్రతినిధులు వెయ్యి మంది హాజరవుతారని తెలిపారు. 19వ తేదీన జరిగే బహిరంగ సభకు కల్లుగీత కార్మికులు గౌడ సోదరులు గౌడ ప్రజాప్రతినిధులు వృత్తి శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు,

.. కామారెడ్డి జిల్లా కల్లుగీత కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఎస్ వెంకట్ గౌడ్, ఉపాధ్యక్షులుగా దేవ గౌడ్, రవీందర్ గౌడ్ ,శంకర్ గౌడ్, కార్యదర్శిగా శివరాజ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మోహన్ గౌడ్ ,సహాయ కార్యదర్శులుగా శేఖర్ గౌడ్, సిద్ధ గౌడ్. గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బసవ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నవీన్ గౌడ్, సిద్ధి రామ గౌడ్,రాజేశ్వర్ గౌడ్ . సాయ గౌడ్ ,సాయిరాం గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.