ఉచిత  హెల్త్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గాజులరామారం పవన్ పుత్ర ఎంటర్ ప్రైస్ మేనెజింగ్ డైరెక్టర్ ఎ. వి రావు అధ్వర్యంలో గాజులరామారం లో ఉషా ముల్లపూడి సెంటర్ దగ్గర ఉచిత ఆరోగ్య శిబిరం ను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ను పరిశీలించి ఈ లాంటి కార్యక్రమాలు ను భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని కోరారు. ఈ శిబిరం ను ఏర్పాటు చేసిన సిబ్బంది మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి మరియు రవి హీలియస్ హాస్పిటల్ ఎండి డా. విజయ్ భాస్కర్ గౌడ్ లు పాల్గొని రోగులకు మందులను పంపిణీ చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. చైర్మన్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తు లో ఇలాంటి క్యాంప్ లను నిర్వహించి పేదలను ఆదుకుంటామని తెలియజేశారు.ఉచిత వైద్య శిబిరమును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని డా. విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సీజనల్‌ వ్యాధులు ఐన జలుబు, దగ్గు, బిపి, షుగర్, మున్నగు వ్యాధులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో డా. శ్రీదేవి, జగన్నాధం ప్రవీణ్, డా. కాయితి మేధా రెడ్డి, డా. శేషు, డా. సంజయ్, ఠాగూర్ స్కూల్ హెడ్ మాస్టర్ సాయి కుమార్, నారాయణ రావు, స్టాఫ్ నర్స్ పర్హీన, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మి, మహేంద్ర రెడ్డి, వెంకట్, మక్కెన లక్ష్మి, లలితా, శివ పార్వతి,గడ్డ మీద యాదమ్మ, సిద్దూ, గోపాల్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు.

Leave A Reply

Your email address will not be published.