భారీ వర్షానికి కొట్టుకుపోయిన బైక్ లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : హైదరాబాద్‌లో రాత్రంతా వర్షం దంచికొట్టింది. వరుణుడు పగబట్టాడా? ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా  కుండపోత వాన కురిసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో జడి వానపడింది. ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు కాలువల్లా మారిపోయాయి. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్‌లు, ఆటోలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. రాత్రి 8 గంటల సమయంలో కొన్ని ప్రాంతాల్లో మొదలైన వర్షం.. ఆ తర్వాత నగరమంతటా విస్తరించింది. దాదాపు 4 గంటల పాటు ఎడతెరిపి లేకుండా విరుచుకుపడింది. ఈ వర్షం దెబ్బకు నాలలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లు నదులను తలపించాయి. కొన్ని చోట్ల వరద నీరు ఇళ్లల్లోకి రావడంతో.. జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.