గాల్లో ఉన్న విమానం లో పొగలు .. స్పైట్ జెట్ కు తప్పిన ప్రమాదం

తెలంగాణ  జ్యోతి /వెబ్ న్యూస్ స్పైట్ జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ఉండగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ SG 3735 విమానం బుధవారం అర్థరాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. పొగ కారణంగా 20 నిమిషాలకుపైగా భయాందోళనకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. స్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పొగ వచ్చిన సమయంలో విమానంలో 86 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గోవా నుంచి బుధవారం రాత్రి 9.55 గంటలకు బయలుదేరింది. 11.30 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండింగ్‌ కావాల్సి ఉంది. విమానం మహారాష్ట్ర గగనతలంలో ఉండగా.. పొగలు వచ్చాయి. పొగలు గుర్తించిన సిబ్బంది సరిగా స్పందించ లేదని ప్రయాణికులు తెలిపారు. శంషాబాదా ఎయిర్ పోర్టులో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో తొమ్మిది విమానాలు ఇతర నగరాలకు మళ్లించారు. ఇందులో ఆరు దేశీయ విమానాలు, రెండు అంతర్జాతీయ విమానాలు, ఒక కార్గో విమానాన్ని దారి మళ్లించారు. అయితే విమానం దిగిన 96 మంది ప్రయాణికులు దాదాపు 20 నిమిషాలు వర్షంలోనే నిల్చోవాల్సిలి వచ్చింది. దీంతో ప్రయాణికులు స్పైట్ జెట్ యాజమాన్యంపై మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.