పీవర్ హాస్పిటల్ లో క్షయ వ్యాధి రోగులు కు టిబి కిట్స్ పంపిణీ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ టిబి కన్వీనర్ డా విజయ్ భాస్కర్ గౌడ్ అధ్వర్యంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి సమక్షంలో శ్రీ విద్యా సెకండరీ స్కూల్ వ్యవస్తాపకులు మధు సూదన్ రెడ్డి సహాయం తో పీవర్(కోరెంటొ) హాస్పిటల్ లో క్షయ వ్యాధి రోగులు కు టిబి కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకు వచ్చి క్షయ వ్యాధి రోగులు ను ఆదుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. యం సి సభ్యులు మహ్మద్ రియాజుద్దీన్, ఆఫీసు సిబ్బంది వెంకట్, హాస్పిటల్ యూనిట్ సూపర్ వైజర్ యాదగిరి, శ్రీనివాస్, హెల్త్ సూపర్ వైజర్ లు లతా, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.