గ్యాంగ్ సినిమా చూసి దోపిడి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఈ నెల 27న సిద్ధి వినాయక షాప్‌లో చోరీ కేసును ఛేదించామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. షాప్‌లోకి వెళ్లి ఐటీ రైడ్స్ అని చెప్పి వెళ్లి దోపిడి చేసినట్లు వెల్లడించారు. 17 గోల్డ్ బిస్కెట్లుతో పరారు అయ్యారని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా అక్కడ బిసినెస్ జరుగుతుంది.. కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి దోపిడీ జరగలేదన్నారు. CDRతో పాటు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించామన్నారు. నిందితులు మహారాష్ట్రకి చెందిన సాంగ్లి జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. ఈ కేసులో 10 మందిలో నలుగురిని అరెస్ట్ చేశామని, 6 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి దగ్గర నుండి 7 బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామనిఇంకా మిగిలిన నిందితులు నుండి 10 బిస్కెట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీపీ పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 మూవీసూర్య నటించిన గ్యాంగ్ సినిమా చూసి ఈ దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసులో రెహ్మాన్జకీర్ప్రవీణ్ యాదవ్ఆకాష్ అరుణ్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఈ ముఠా ఐటీ ఆఫీసర్ అని చెప్పినకిలీ ఐడీ కార్డ్ చూపించి దోపిడీ చేశారని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.