నవంబర్‌లో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్!?

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సన్నద్దమవుతోంది. వరుసగా అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది. ఈనెల 5 నుంచీ 10 వరకూ ఈసీ మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇవ్వనున్నారు. ఓటర్ల నమోదు మొదలు కొని పోలింగ్ఓట్ల లెక్కింపు వరకూ ఎన్నికల ప్రాసెస్‌పై శిక్షణ ఇవ్వనుంది. ఇక మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలకు సంబంధం ఉండే కలెక్టర్లుఅదనపు కలెక్టర్లుఆర్డీఓలుతహసీల్దార్‌లుడిప్యూటీ తహసీల్దార్‌లతో పాటు కింది స్థాయి సిబ్బంది బదిలీలు జులై 31 లోపు పూర్తికానుంది. ఇక నవంబర్‌లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఓటర్ల సంఖ్య మరింత పెరగనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.