వరద ఉదృతికి వాగులో పడ్డ భారీ ట్యాంకర్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా అంనతపురం, కడప జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక అనంపురం జిల్లాలో అయితే ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్ లో ఎడతెరిపి లేని వానలు కుమ్మేస్తున్నాయి. దీంతో  ఊళ్లు.. చెరువులు ఏకమయ్యాయి.. చాలా గ్రామాలు జల విలయంలో చిక్కుకున్నాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో  అనంతపురం నగరానికి   తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు  జిల్లాలోని బుక్కరాయ సముద్రం చెరువు దగ్గర వాగులో లారీ ట్యాంకర్ కొట్టుకుపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువుకు వరద ప్రవాహం ఎక్కువైంది. అనంతపూర్ వైపు నుంచి వస్తున్న వరదకు మరువ కాలువ పొంగి ప్రవహిస్తుండగా, మరువ కాలువ దాటుతుండగా లారీ కొట్టుకుపోయింది. తిన్నాగా వెళ్లాల్సిన లారీ.. అలా వాగులోకి వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. డ్రైవర్ కు డ్రండ్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి.. డ్రైవర్ పీకలలోతు మద్యం సేవించినట్టు గుర్తించారు. మరోవైపు  గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఫలితంగా అనంతపురం నగరంలోని లోతట్టు కాలనీలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి ప్రధానంగా నగరంలోని నడిమి వంక కాలువ నుంచి నీరు ఉదృతంగా పలు కాలనీలోకి చర్చికి వచ్చి జనావాశం మొత్తం జలమయమైంది దీంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని రక్షించే క్రమంలో వివిధ శాఖల అధికారులు నిమగ్నమయ్యారు నగరంలోని రంగస్వామి నగరంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక బోట్లతో ప్రజలను ఇళ్లల్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ముఖ్యంగా అనంతపురం నగరం భారీగా వరద ప్రవాహాన్ని ఎదుర్కొంటోంది. పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. అనంతపురం నగరంలోని దాదాపు 18 కాలనీలు జలమయమైనట్లు తెలుస్తోంది. అనంతపురంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు అండగా ఉండాలని అధికారులను సిఎం ఆదేశించారు.

 

Leave A Reply

Your email address will not be published.