నేతలెవరకూ వేరొక పార్టీలోకి వెళ్లకుండా బీజేపీ అదిరిపోయే స్కెచ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణ బీజేపీ సైలెంట్ అయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వరమైతే పెద్దగా ఎక్కడా కూడా వినిపించిందే లేదు. ఇక కొందరు నేతలు మాట్లాడుతున్నా కూడా తెలంగాణలో బీజేపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని.. మూడో స్థానానికి పడిపోయిందని.. ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇటీవలి కాలంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ప్రముఖ నేతలు చేరబోతున్నట్టు కూడా వార్తలొచ్చాయి.ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. నేతలెవరకూ వేరొక పార్టీలోకి వెళ్లకుండా అదిరిపోయే స్కెచ్ వేసింది. మరి ఆ స్కెచ్ ఏంటిఇప్పటి వరకూ బీజేపీలో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని పలువురు నేతలు కలత చెందుతూ వచ్చారు. బీజేపీ అధిష్టానం బండి సంజయ్ మినహా తమను దగ్గరికి రానివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే టాక్ కూడా నడిచింది. దీంతో రాష్ట్రంపై బీజేపీ సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కీలక నేతలందరికీ బీజేీపీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.ఢిల్లీకి రావాలంటూ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. పార్టీ పిలుపు మేరకు నేడో రేపో హస్తినకు కమలనాథులు వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ పోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఈ నెలలో తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షాజేపీ నడ్డా రానున్నారు. 15న ఖమ్మంలో అమిత్ షా, 25న నాగర్ కర్నూల్ లో జేపీ నడ్డాల బహిరంగ సభలు జరగనున్నాయి.ఇక ప్రధాని మోదీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో ఈ నెల 30న జరిగే సభలో పాల్గొంటారని సమాచారం. త్వరలో బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. డీకే అరుణఈటలరాజగోపాలరెడ్డికొండా విశ్వేశ్వరెడ్డి లాంటి నేతలకు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంఅలాగే నేతలు పార్టీ మారకుండా చూసుకోవడమే లక్ష్యంగా అధిష్టానం అడుగులు వేస్తోంది. మొత్తానికి నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే మాత్రం వారు పార్టీ మారే అవకాశమే ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.