రైతును శ్రీమంతుడిని చేసిన వర్షం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆ ఊళ్లో వర్షాలు పడితే వజ్రాల పంట పండుతుంది. రాత్రికి రాత్రే రైతులు కోటీశ్వరులైపోతారు. వానాకాలం వస్తే ఆ ఊరే కాదు. చుట్టుపక్కల గ్రామాలు మండలాలు జిల్లాల నుంచి ఆశావాహులు ఇక్కడ వాలిపోతారు. రోజుల తరబడి వజ్రాల కోసం వెతుకులాడుతుంటారు. ఆ ప్రాంతమే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలు. గతంలో చాలా మంది రైతులు భూమిలో దొరికిన వజ్రాలతో కోటీశ్వరులయ్యారు. తాజాగా బసినేపల్లిలో మరో వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. పొలంలో కోట్లు విలువ చేసే వజ్రం లభ్యమైంది.అసలు విషయం ఏమింటంటే… ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం కర్నూలు జిల్లాల ప్రజలు రెండు జిల్లాల సరి హద్దుల్లో విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. వర్షం వస్తే ఇక్కడి నేలలపై పంటలు పండుతాయో లేదోగానీ.. వజ్రాలు మాత్రం పండుతాయని నమ్ముతుంటారు. జిల్లాలోని మద్దెకర మండలంలోని బసినేపల్లి లో ఓ రైతుకు వజ్రం కళ్లబడింది. ఆ వజ్రాన్ని అక్కడే వేలం పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని 2 కోట్ల రూపాయలు పలికినట్లుగా తెలుస్తోంది.ఆ విషయం అందరికి తెలియడంతో జనాలు పొలాల్లో వాలిపోయారు. వర్షాలు పడ్డప్పడు వెతికితే వజ్రాలు దొరుకుతాయని.. స్థానికులు ఏటా ఈ సమయంలో వెదుకు లాడుతుంటారు. కానీ అదృష్టం ఉంటే.. రాత్రికి రాత్రే కోటిశ్వరులై పోవచ్చున్నమాట. తమకు కూడా వజ్రం దొరకకపోతుందా అనే ఆశతో వెతుతుంటారు. అలా రాత్రికి రాత్రే ఓ రైతును వర్షం శ్రీమంతుడిని చేసింది. ఒకే ఒక్క వజ్రం… అతని జీవితాన్ని మార్చేసింది.
అసలు ఎక్కడివి ఈ వజ్రాలు అనే ప్రశ్న చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కర్నూలు జిల్లా శ్రీ కృష్ణ దేవరాయలు ఏలిన ప్రదేశం. అప్పటి కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మవారి చెబుతుండేవారు. అప్పటి కాలంలోని వజ్రాలు భూముల్లో ఉండిపోయాయని అంటూ ఉంటారు. అలా వర్షాలు పడుతున్న కొద్దీ మట్టి పొరల్లో దాగిన ఎంతో విలువైన వజ్రాలు బయటపడతాయట. వజ్రాలను వెతకటానికి వేరే జిల్లా నుండే కాక వేరే రాష్ట్రాల నుండి కూడా పెద్దఎత్తున జనాలు ఇక్కడికి వస్తుంటారు.

Leave A Reply

Your email address will not be published.