కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారం కు వెళ్ళక పోవడం సరికాదు

.. విహెచ్, మాజీ ఎంపి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారం కు వెళ్ళక పోవడం సరికాదని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. అన్న దమ్ములు వేరు వేరు పార్టీల్లో ఉండటం కొత్త కాదు నేను ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకునే వెంకట్ రెడ్డి ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉంది ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం విమర్శలకు తావిస్తోందన్నారు. ఇప్పుడు వెంకట్ రెడ్డి విదేశాలకు వెళ్ళడం సరికాదని, ఇలాంటి ప్రవర్తన వల్ల టీఆర్ఎస్ నేతలు కోవర్ట్ రెడ్డి అంటున్నారన్నారు. వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్ళక పోతే .. కోవర్ట్ రెడ్డి అనేది నిజమౌతుందని తెలిపారు. వెంకట్ రెడ్డి ప్రవర్తన వల్ల ఆయన ఇంటి పేరు కూడా మారుతుందని,  తాను వెంకట్ రెడ్డి ని కలిసే ప్రయత్నం చేశాను కానీ కలవలేదని, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు మార్చుకోవాలని చేతులు జోడించి అడుగుతున్నానన్నారు.

Leave A Reply

Your email address will not be published.