పోలవరం నిషేధిత ప్రాంతమా?
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పోలవరం నిషేధిత ప్రాంతమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. పోలవరం లో పర్యటిస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో పోలవరం పర్యటన సందర్భంగా రాజమండ్రిలో తనను కూడా అడ్డుకుని అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు దేవినేని ఉమా, నిమ్మల రామానాయుడు తదితరుల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు పోలవరంలో పర్యటించకూడదా?, పోలవరం నిర్మాణంలో జగన్ సర్కార్ ఏ తప్పు చేయకపోతే భయమెందుకు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపక్షాలను పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్లాలన్నారు.